నెలసరి నొప్పుల్ని దూరం చేసే స్మూతీ!

కడుపు నొప్పి, నడుం నొప్పి, నీరసం, చికాకు, మూడ్ స్వింగ్స్, అధిక రక్తస్రావం.. నెలసరిలో ఈ సమస్యలన్నీ సహజమే! ఇవి మన ఆరోగ్యంపైనే కాదు.. కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో నెలసరి నొప్పుల్ని తగ్గించే ఓ హెల్దీ స్మూతీ తయారీ గురించి తెలుసుకుందాం..

Published : 20 Nov 2023 16:22 IST

కడుపు నొప్పి, నడుం నొప్పి, నీరసం, చికాకు, మూడ్ స్వింగ్స్, అధిక రక్తస్రావం.. నెలసరిలో ఈ సమస్యలన్నీ సహజమే! ఇవి మన ఆరోగ్యంపైనే కాదు.. కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలో నెలసరి నొప్పుల్ని తగ్గించే ఓ హెల్దీ స్మూతీ తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు

నానబెట్టిన బాదం పప్పులు- 10

ఖర్జూరాలు - 5

శతావరి పొడి (ఇది మార్కెట్లో దొరుకుతుంది) - పావు టీస్పూన్

అశ్వగంధ పౌడర్‌ - పావు టీస్పూన్

నీళ్లు - పావు లీటర్‌

తయారీ విధానం

ముందురోజు రాత్రి నీటిలో నానబెట్టిన బాదం పప్పులపై పొట్టు తొలగించుకోవాలి. వీటిని ఖర్జూరాలు, శతావరి, అశ్వగంధ పొడులతో కలిపి కొద్దికొద్దిగా నీళ్లు చేర్చుతూ మెత్తగా స్మూతీలా మిక్సీ పట్టుకోవాలి. కావాలంటే ఈ క్రమంలో మీకు ఇష్టమైన పండ్లను కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల స్మూతీకి మరింత రుచి వస్తుంది. నెలసరి సమంయలో ఈ స్మూతీని బ్రేక్‌ఫాస్ట్‌గా లేదంటే సాయంత్రం స్నాక్స్ టైంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది.

హార్మోన్లు సమతులంగా..!

ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న మూలికల్లో శతావరి ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ముఖ్యంగా పిరియడ్స్‌ సమయంలో కలిగే ఆందోళనలు, మూడ్‌ స్వింగ్స్‌ను ఈ చూర్ణం తగ్గిస్తుంది. అదేవిధంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని, బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి వీరు ఈ చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే మంచిది.

సంతానోత్పత్తికి అశ్వగంధ!

ఇది కూడా ఒక ఆయుర్వేద మూలికే. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో కార్టిసాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఫలితంగా నెలసరి సమయంలో ఆందోళన, యాంగ్జైటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయుల్ని నియంత్రిస్తుంది. శారీరక వాపు సమస్యలను దూరం చేస్తుంది. మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్