అందుకే అది కూడా వ్యాయామమేనట..!

శృంగారం.. దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచే సాధనం. కానీ శరీర బరువు తగ్గించే వ్యాయామంగానూ ఇది దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి.. అదనపు క్యాలరీల్ని కరిగించే కార్డియో వ్యాయామంగా శృంగారాన్ని పేర్కొంటున్నారు.

Published : 21 Mar 2024 16:29 IST

శృంగారం.. దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచే సాధనం. కానీ శరీర బరువు తగ్గించే వ్యాయామంగానూ ఇది దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి.. అదనపు క్యాలరీల్ని కరిగించే కార్డియో వ్యాయామంగా శృంగారాన్ని పేర్కొంటున్నారు.

ప్రత్యక్షంగా.. పరోక్షంగా..!

శృంగారంలో శారీరక కదలికలు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి.. ఫలితంగా క్యాలరీలు కరుగుతాయి. అందుకే దీనిని కార్డియో వ్యాయామంగా పేర్కొంటున్నారు నిపుణులు. 24 నిమిషాల శృంగారం వల్ల 69 క్యాలరీలు ఖర్చవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బరువు తగ్గాలంటే దీంతో పాటు శృంగారంలో పాల్గొనే సమయం, తీవ్రత.. వంటివన్నీ కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. వీటన్నింటి ఫలితంగా 80-300 క్యాలరీల దాకా ఖర్చయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఇలా శృంగారం ప్రత్యక్షంగానే కాదు.. పరోక్షంగానూ బరువు తగ్గించడంలో దోహదం చేస్తుందట! అదెలాగంటే.. లైంగిక చర్య వల్ల ఒత్తిడి తగ్గి డోపమైన్‌ అనే హ్యాపీ హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది మనసును ఉత్తేజితం చేసి.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ శృంగారానికి ఎంత సమయం కేటాయిస్తున్నామనే అంశం పైన కూడా ఎంత బరువు తగ్గుతామన్నది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.

⚛ శృంగారంలో దంపతుల మధ్య చోటుచేసుకునే శారీరక సాన్నిహిత్యం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. కదలికల వల్ల గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది. ఫలితంగా క్యాలరీలు త్వరగా కరిగిపోతాయి. తద్వారా బరువు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు.

⚛ శృంగార కోరికల్ని పెంచేలా దంపతులిద్దరూ కలిసి పుషప్స్‌, స్క్వాట్స్.. వంటి వ్యాయామాలూ ప్రయత్నించచ్చు. వీటివల్ల కూడా శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు.

వీటన్నింటితో పాటు శరీరంలో ఎప్పుడూ తగినంత నీటి శాతం ఉండడానికి నీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యం. ఇదీ క్యాలరీలు కరిగేందుకు దోహదం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్