Published : 23/12/2021 21:13 IST

నల్లమచ్చలు పోవాలంటే ఏం చేయాలి?

నమస్తే మేడం. నా ముక్కు మీద వేడి గుల్ల వచ్చింది. దానికి నేను రాత్రిపూట వెల్లుల్లి పేస్ట్ అప్త్లె చేశాను. మరుసటి రోజు ఉదయానికి వెల్లుల్లి రాసిన చోట నల్లగా మారింది. తిరిగి అది పోవాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ. బాగా పండిన బొప్పాయి గుజ్జు టీస్పూన్, బాదం పేస్ట్ అర టీస్పూన్ చొప్పున తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన చోట ప్యాక్‌లాగా అప్త్లె చేయాలి. పావుగంట ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ విధంగా నెలరోజులు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

బాదం పేస్ట్ తయారీ:

రాత్రి పూట రెండు బాదం గింజలను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే వాటి పొట్టు తీసి పప్పుని మెత్తగా దంచితే బాదం పేస్ట్ తయారవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని