తలలో దురద.. తగ్గాలంటే..
నికిత ఉదయం ఎంత హుందాగా తయారై ఆఫీసుకు వెళ్లినా.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి మాత్రం జుట్టు చిందరవందరగా అయిపోతుంది. కారణం తలలో దురద. దీంతో ఆమె ఆఫీసు పని పైనా శ్రద్ధ పెట్టలేకపోతోంది. ఇలాంటి సమస్య చాలామందే ఎదుర్కొంటుంటారు. ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల......
నికిత ఉదయం ఎంత హుందాగా తయారై ఆఫీసుకు వెళ్లినా.. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసరికి మాత్రం జుట్టు చిందరవందరగా అయిపోతుంది. కారణం తలలో దురద. దీంతో ఆమె ఆఫీసు పని పైనా శ్రద్ధ పెట్టలేకపోతోంది. ఇలాంటి సమస్య చాలామందే ఎదుర్కొంటుంటారు. ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల మాడు పొడిబారిపోవడం, చుండ్రు, పేలు.. ఇలా పలు కారణాల వల్ల తలలో విపరీతమైన దురద పుడుతుంది. దీనివల్ల ఎప్పుడు చూసినా చేతులు తలలోకే వెళ్తుంటాయి. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు పటుత్వం కోల్పోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొదట్లోనే సమస్యకు ఫుల్స్టాప్ పెట్టాలి. దీనికీ కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం రండి..
నూనె రాస్తున్నారా?
కొంతమంది సమయం లేకనో లేదంటే జిడ్డుగా కనిపించకూడదనే ఉద్దేశంతోనో.. తలకు నూనె రాయరు. దీంతో కుదుళ్లు పొడిబారిపోయి దురదకు దారి తీస్తుంది. అలాగే జుట్టు కూడా నిర్జీవమైపోతుంది. ఫలితంగా కుదుళ్లు, జుట్టు.. రెండూ ఆరోగ్యాన్ని కోల్పోతాయి. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి సహజసిద్ధంగా లభించే నూనెలను తగిన మొత్తంలో కనీసం వారానికోసారైనా రాసుకోవాలి. దీనివల్ల దురద తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు జుట్టు కూడా పట్టులా మెరుస్తుంది.
మసాజ్ చేయాలి
కుదుళ్లకు సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా మాడు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నూనె రాసుకునే ముందు దాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకుని దాంతో మాడుపై కాసేపు మసాజ్ చేయాలి. దీంతో కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నూనె రాసిన తర్వాత జిడ్డుగా ఉంది అనిపిస్తే.. గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే తేడా మీకే తెలుస్తుంది.
తడిగా వద్దు..
చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల జుట్టు మొదట్లో పూర్తిగా ఆరదు. దీంతో ఆ ప్రదేశంలో ఫంగస్ చేరే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో కూడా దురద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరిపోకముందే గట్టిగా కట్టుకోవడం కాకుండా వదులుకోవడం లేదా చిన్న క్లిప్ పెట్టుకోవడం మంచిది.
ఆహారం కూడా ముఖ్యమే!
తల్లో దురద తగ్గించడంలో ఆహారానిది కూడా కీలక పాత్రే. ఈ క్రమంలో- మైక్రోన్యూట్రియంట్లు అధికంగా లభించే పండ్లు, కూరగాయలు, నట్స్.. వంటివి రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లు ఆరోగ్యంగా తయారై జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దురద కూడా తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
- బుజ్జాయిలకూ గ్యాడ్జెట్లు..!
- హెయిర్ డై.. మచ్చలుపడితే..!
- సెరమైడ్స్... మాయ చేసేనా?
- ఫోన్ స్ట్రాప్స్ వాడుతున్నారా?
ఆరోగ్యమస్తు
- అందుకే పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట!
- అన్నీ తినాలి మరి!
- నవ్వితే లాభాలెన్నో!
- చెమట వల్ల.. అక్కడ ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా..!
- పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
అనుబంధం
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
- అసహనం వద్దు..!
- ఆడిద్దామా... స్పడ్!
యూత్ కార్నర్
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
- ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
- స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
- ధనుష్య... వేడుకను చిత్రించేస్తుంది!
'స్వీట్' హోం
- కిచెన్‌లో దుర్వాసనలు పోవాలంటే..!
- ఇంట్లోనూ... సీతాకోక చిలకల సోయగం...
- ఏకాగ్రత పెంచే వామనగుంటలు
- ఎండ వేడిమిని తరిమేసే చల్లని ‘టీ’లు..!
- అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
వర్క్ & లైఫ్
- ఈ జుగుప్స ఎందుకు?
- ఆ మౌనానికి కారణం తెలుసా!
- సరదా తప్పులు!
- అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
- Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!