Dear Vasundhara: అప్పట్నుంచి నా మరిది నాతో చనువుగా ఉంటున్నాడు..!
నాకు ౩౫ ఏళ్లు. ఆరు నెలల క్రితం మా మరిదికి, అతని భార్యకు విడాకులయ్యాయి. అప్పట్నుంచి అతని ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. నాతో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నా అనుమతి లేకుండా నా ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒకసారి కావాలని నా చేతులు పట్టుకున్నాడు.
నాకు ౩౫ ఏళ్లు. ఆరు నెలల క్రితం మా మరిదికి, అతని భార్యకు విడాకులయ్యాయి. అప్పట్నుంచి అతని ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. నాతో చనువుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నా అనుమతి లేకుండా నా ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఒకసారి కావాలని నా చేతులు పట్టుకున్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దాంతో అప్పట్నుంచి అతన్ని దూరం పెడుతూ వస్తున్నాను. మావారితో చెబితే ‘వాడి గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు’ అని నా మీదే కోప్పడుతున్నారు. ఈ క్రమంలో- అతను కావాలనే అలా చేస్తున్నాడా? లేదంటే నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? తెలియడం లేదు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. గత ఆరు నెలలుగా మీ మరిది ప్రవర్తనతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మీ భర్తతో చెబితే సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. దానికి తోడు ఆయన ‘నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు’ అనడం మిమ్మల్ని ఆలోచనలో పడేసినట్టుగా అనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా ఈ సమస్యకు ఒక ముగింపు తీసుకురావడం ఎంతో అవసరం. మీ మరిది, అతని భార్యకు మధ్య విడాకులకు దారి తీసిన పరిస్థితులను వివరించలేదు. సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది ఒకరకమైన ఒత్తిడి, ఆందోళనలతో (Post Traumatic Stress) బాధపడుతుంటారు. దీనివల్ల వారి ప్రవర్తనలో తేడాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు తప్పకుండా మానసిక నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మరిది విషయంలో అలాంటి సమస్యలేవీ లేనప్పుడు అతను ఉద్దేశపూర్వకంగానే తన పరిధిని దాటుతున్నట్లు భావించాలి. ఇలాంటి ప్రవర్తనను ఉపేక్షించడం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి, మీ భర్తతో మరోసారి చర్చించే ప్రయత్నం చేయండి. మీ మరిది ప్రవర్తనతో మీరు పడుతున్న ఇబ్బంది గురించి స్పష్టంగా చెప్పి ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పండి. ఒకవేళ అతనికి మానసిక పరమైన సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయమని సూచించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.