లాపరోస్కోపీ చేసినా అదే సమస్య.. ఏం చేయాలి?

డాక్టర్‌ గారు.. నాకు పెళ్లై రెండు సంవత్సరాలు అవుతోంది. నాకు పీసీఓఎస్‌ సమస్య ఉంది. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య తగ్గడం లేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే లాపరోస్కోపీ చేశారు. చికిత్సకు ముందు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చేవి. కానీ, చికిత్స తర్వాత రెండు నెలల నుంచి పిరియడ్స్‌ రావడం లేదు.

Published : 21 Sep 2021 17:16 IST

డాక్టర్‌ గారు.. నాకు పెళ్లై రెండు సంవత్సరాలు అవుతోంది. నాకు పీసీఓఎస్‌ సమస్య ఉంది. ఎన్ని మందులు వాడినా ఈ సమస్య తగ్గడం లేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే లాపరోస్కోపీ చేశారు. చికిత్సకు ముందు పిరియడ్స్‌ రెగ్యులర్‌గా వచ్చేవి. కానీ, చికిత్స తర్వాత రెండు నెలల నుంచి పిరియడ్స్‌ రావడం లేదు. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్‌ వచ్చింది. నా సమస్య తిరిగి మొదటికి వచ్చిందేమోనని భయంగా ఉంది. దయచేసి పరిష్కారం తెలుపగలరు. - ఓ సోదరి

జ. పీసీఓఎస్‌ హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. లాపరోస్కోపీలో భాగంగా గర్భాశయంలో ఉండే నీటి బుడగలను మాత్రమే పగలగొడతారు. కాబట్టి, దీని ద్వారా పీసీఓఎస్‌ సమస్య పూర్తిగా తొలగిపోతుందనేది ఒక అపోహ మాత్రమే. ఈ సమస్య తగ్గడానికి కొన్ని రకాల మందులు వేసుకుంటూనే మీ జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒత్తిడికి గురయ్యే అంశాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి తప్పనిసరి. సాధారణంగా పీసీఓఎస్‌ ఉన్న వారు అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ముందు బరువు తగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి క్రమంగా పిరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాయామానికి కనీసం అరగంట కేటాయించడం వల్ల మంచి ఫలితాలు పొందచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్