వయసు ఏడాదిన్నరే.. జ్ఞాపకశక్తి మాత్రం అమోఘం!

సంవత్సరంన్నర పాపాయి అంటే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. వాళ్లు వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే ఎంతో ముద్దొస్తుంటుంది. కేరళకు చెందిన అలెగ్జాండ్రా అభిలాష్ అనే చిన్నారి మాత్రం అదే వయసులో ప్రముఖులు, కార్టూన్‌ పాత్రల పేర్లు, ఇంట్లోని వస్తువులను.....

Published : 11 Apr 2022 20:12 IST

(Photo: India Book of Records)

సంవత్సరంన్నర పాపాయి అంటే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. వాళ్లు వచ్చీరాని మాటలు మాట్లాడుతుంటే ఎంతో ముద్దొస్తుంటుంది. కేరళకు చెందిన అలెగ్జాండ్రా అభిలాష్ అనే చిన్నారి మాత్రం అదే వయసులో ప్రముఖులు, కార్టూన్‌ పాత్రల పేర్లు, ఇంట్లోని వస్తువులను గుర్తు పట్టి వాటి పేర్లను చెబుతూ ఔరా అనిపిస్తోంది. అంతేకాదు.. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకుంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...

అలా తెలిసింది...

అలెగ్జాండ్రా కేరళలోని ఎర్నాకులం ప్రాంతంలో ఆగస్టు 5, 2020న జన్మించింది. ఈ చిన్నారికి పేర్లు గుర్తు పెట్టుకునే లక్షణం ఉందని ఆమె తల్లిదండ్రులకు ఆనుకోకుండా తెలిసిందట. ఆ చిన్నారిని ఆడించడానికి పక్షులు, జంతువుల బొమ్మలను చూపించి వాటి పేర్లు చెప్పేవారట. ఆ తర్వాత బొమ్మలు, వాటి పేర్లను గుర్తు పెట్టుకుని చెప్పడం మొదలుపెట్టిందట ఆ చిన్నారి. అలా తన బిడ్డలో ఉన్న జ్ఞాపకశక్తిని గుర్తించానని చెబుతున్నారు తల్లి శిల్ప. దాంతో ఆమె మరిన్ని బొమ్మలు, వాటి పేర్లను నేర్పించడం మొదలుపెట్టింది. అలా అలెగ్జాండ్రాకు ఏడాది వయసు దాటాక ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రుల పేర్లు మొదలైనవి నేర్పడం ప్రారంభించారు.  అలెగ్జాండ్రాను ముద్దుగా ‘అల్లు’ అని పిలుస్తారట.

గుర్తింపు దక్కాలని..

‘ఇంత చిన్న వయసులో ప్రతిభ చూపుతోన్న మా అమ్మాయికి గుర్తింపు దక్కాలని భావించాను. దానికోసం ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌ వారిని సంప్రదించాను. అయితే వారు ఇందులో చోటు సంపాదించుకోవాలంటే కనీసం సంవత్సరంన్నర వయసుండా లని చెప్పారు. దాంతో గత మార్చి మూడున మరోసారి సంప్రదించాను. వారు వివిధ కేటగిరీలకు చెందిన పేర్లను మా పాప చెబుతున్నప్పుడు వీడియోల రూపంలో పంపించమని చెప్పారు. దాంతో అల్లు చెప్పిన పేర్లను వీడియో తీసి పంపించా. ఇటీవలే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు దానిని గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చారని’ ఆమె చెప్పుకొచ్చింది.

ఇందులో భాగంగా అల్లు ఐదుగురు ప్రముఖుల పేర్లు, వాహనాలు (10), జంతువులు (20), కార్టూన్‌ పాత్రలు (5), శరీర భాగాల పేర్లు (10), రాజకీయ నాయకులు (5), పక్షులు (15), కూరగాయలు (12), పండ్లు (12), ఆహార పదార్థాలు (15), సినీ తారలు (7), ఇంట్లో వస్తువులు (24), కీటకాలు (8), వంట సామగ్రి(8), ఫర్నిచర్‌ (5), ఎలక్ట్రానిక్‌ వస్తువులు(4).. మొదలైన పేర్లను అవలీలగా చెప్పేయడం విశేషం.

మరి మీరూ మీ చిన్నారుల్లో ఉన్న ప్రత్యేకతలను గుర్తించారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. శిల్ప మాదిరిగా వాటికి మరింత సాన పట్టండి.. చిన్నప్పటి నుంచే వాళ్ల విజయానికి బాటలు వేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్