Besties Forever: ఇదే మా గర్ల్ గ్యాంగ్!
స్నేహబంధం.. మరువలేనిది, మరపురానిది! అందుకే అది పెళ్లైనా, పార్టీ అయినా ప్రాణమిత్రులందరూ కలవాల్సిందే.. సరదాగా గడపాల్సిందే! అందులోనూ కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. మనం మాత్రం మన గర్ల్ గ్యాంగ్‌ని అస్సలు మిస్సవ్వం. తానూ ఇందుకు మినహాయింపు.....
(Photos: Instagram)
స్నేహబంధం.. మరువలేనిది, మరపురానిది! అందుకే అది పెళ్లైనా, పార్టీ అయినా ప్రాణమిత్రులందరూ కలవాల్సిందే.. సరదాగా గడపాల్సిందే! అందులోనూ కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా.. మనం మాత్రం మన గర్ల్ గ్యాంగ్‌ని అస్సలు మిస్సవ్వం. తానూ ఇందుకు మినహాయింపు కాదంటోంది మన శ్రీవల్లి.. రష్మిక. ఇటీవలే తన చిన్ననాటి స్నేహితురాలి వివాహానికి హాజరైన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ తన గర్ల్ గ్యాంగ్‌తో తెగ సందడి చేసింది. ఫొటోలకు పోజిస్తూ మురిసిపోయింది.. ‘17 ఏళ్ల స్నేహబంధం మాది. ఏమీ మారలేదు.. అప్పుడెంత ఆప్యాయంగా ఉన్నామో.. ఇప్పుడు మరింత దగ్గరయ్యాం.. ఇదే నా గర్ల్ గ్యాంగ్!’ అంటూ తన బెస్టీస్‌తో దిగిన ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుందీ కన్నడ కుట్టి. ఇక ఈ పెళ్లిలో వీరంతా కూర్గ్ స్టైల్‌లో చీరకట్టి సందడి చేశారు.
ఇలా రష్మిక ఒక్కర్తే కాదు.. ఎంతోమంది నటీమణులు వేర్వేరు సందర్భాల్లో, ప్రత్యేక అకేషన్స్, వెకేషన్స్‌లో తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకున్నారు. మరి, ఆ స్వీట్ మెమరీస్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.