పాడవకుండా ‘క్లిప్‌’ పెట్టేద్దాం!

సరుకులు కొన్నప్పుడు వాటిలో కొన్నిటిని అవసరమైనంత మేర డబ్బాల్లో నింపుకొని.. మిగతావి అలాగే కవర్లలోనే కప్‌బోర్డ్‌లో పెట్టేస్తుంటాం. దాంతో వాటిలో గాలి, తేమ చేరి.. మెత్తబడడం, బూజెక్కడం.. గమనిస్తుంటాం.

Published : 29 Aug 2023 12:29 IST

సరుకులు కొన్నప్పుడు వాటిలో కొన్నిటిని అవసరమైనంత మేర డబ్బాల్లో నింపుకొని.. మిగతావి అలాగే కవర్లలోనే కప్‌బోర్డ్‌లో పెట్టేస్తుంటాం. దాంతో వాటిలో గాలి, తేమ చేరి.. మెత్తబడడం, బూజెక్కడం.. గమనిస్తుంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగానే ప్రస్తుతం.. కవర్‌ సీలింగ్‌ క్లిప్స్ అందుబాటులోకొచ్చాయి.

వీటిలో సాధారణ క్లిప్‌ మాదిరిగా ప్రెస్‌ చేసి.. కవర్‌ను లాక్‌ చేసేవి కొన్నైతే.. క్లిప్‌తో పాటు డిస్పెన్సర్‌ అమరి ఉన్నవి మరికొన్ని. ఇక ఈ సాధారణ క్లిప్స్‌లోనూ.. పూల ఆకృతిలో ఉన్నవి, చేపల డిజైన్‌ను పోలి ఉన్నవి, క్లిప్‌తో పాటే పట్టుకోవడానికి హ్యాండిల్‌ అనుసంధానించి ఉన్నవి, క్యారట్‌ వంటి కాయగూరల ఆకృతిని పోలి ఉన్నవి.. ఇలా విభిన్న డిజైన్లలో తయారుచేసిన కవర్‌ సీలింగ్‌ క్లిప్స్‌ మార్కెట్లో దొరుకుతున్నాయి. డిస్పెన్సర్‌ విషయానికొస్తే.. గుండ్రంగా మూతతో పాటే ఉన్నవి, లంచ్‌ బాక్స్‌ తరహాలో కాస్త పెద్దగా ఉన్నవి.. లభిస్తున్నాయి. అంతేకాదు.. కాఫీ, ఇతర పొడుల్ని కొలతలతో సహా వేసుకునేలా స్పూన్‌ తరహా క్లిప్స్‌ కూడా అందుబాటులోకొచ్చాయి. వీటితో కవర్లను బిగించేస్తే.. అందులోని పదార్థాలు పాడవకుండా ఉంటాయి.. అవసరమైనప్పుడు వాటిని సులభంగా వాడుకోవచ్చు కూడా! అలాంటి కవర్‌ సీలింగ్‌ క్లిప్సే ఇవి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్