వీటిని ఎలా వండుతున్నారు?

కొన్ని రకాల కూరగాయలు, మాంసం వండే విషయంలో.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకో చూడండి మరి..!

Published : 10 Mar 2024 12:50 IST

కొన్ని రకాల కూరగాయలు, మాంసం వండే విషయంలో.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకో చూడండి మరి..!

బంగాళాదుంపలు..

బంగాళాదుంపల్ని మరీ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉడికించకూడదు. అలా చేస్తే వాటిలోని పోషక విలువలు పోతాయి. అందుకే బంగాళాదుంపల్ని బాగా కడిగి మధ్యలో చిన్నగా కోసి పొట్టుతో ఉడికించాలి. అలా చేయడం వల్ల దుంపల పొట్టులో ఉండే పీచు పోదు. ఇతర పోషకాలూ అందుతాయి.

క్యాబేజీ..

చాలామంది క్యాబేజీని ఉడికించి కూర చేస్తారు. ఇలా ఉడికించినప్పుడు అందులో శరీరానికి మేలు చేసే గుణాలన్నీ వృథాగా పోతాయి. అందుకే దీన్ని ఉడికించేటప్పుడు నీళ్లలో నూనె లేదా కాస్త వెన్న వేయాలి. అప్పుడే పోషకాలు పోవు. క్యాబేజీని అతిగా ఉడికించినా, వేయించినా సల్ఫర్‌ విడుదలై దాని రుచి మారే ప్రమాదముంటుంది.

ఉల్లిపాయలు..

సలాడ్లు, బర్గర్లు, శాండ్‌విచ్‌ వంటి వాటిల్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తుంటాం. నిజానికి ఇది మంచి పద్ధతి. పచ్చి ఉల్లిపాయల్లో సల్ఫర్‌ ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. కాబట్టి వాటిని వేయించకూడదు.

మాంసం-చేపలు..

వీటిని ఎక్కువ మంట మీద ఉడికిస్తే అందులో ఉండే మాంసకృత్తులు నశించిపోతాయి. ఆరోగ్యానికి హాని చేసే కార్సినోజెనిక్ కాంపౌండ్లు, హెటరో సైక్లిక్ అమైన్స్‌ విడుదలవుతాయి. అందుకే తక్కువ మంట మీద ఉడికించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్