కనుల విందుగా.. మనసు నిండుగా.. సౌదీలో ‘సంక్రాంతి’ శోభ!

పండగంటేనే సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వేడుక. ఏ దేశంలో స్థిరపడ్డా మన సంప్రదాయ మూలాలు మర్చిపోకూడదని ఇలాంటి వేడుకల ద్వారా చాటిచెబుతున్నారు మన తెలుగువారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఇటీవలే సౌదీలో నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’.

Updated : 30 Jan 2024 14:35 IST

పండగంటేనే సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వేడుక. ఏ దేశంలో స్థిరపడ్డా మన సంప్రదాయ మూలాలు మర్చిపోకూడదని ఇలాంటి వేడుకల ద్వారా చాటిచెబుతున్నారు మన తెలుగువారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే.. ఇటీవలే సౌదీలో నిర్వహించిన ‘సంక్రాంతి సంబరాలు’.

సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలుగు ప్రవాసీ సంఘమైన ‘సాటా’ (సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఇటీవలే సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. సాఫ్వా ప్రాంతంలో జరిగిన ఈ సంబరాల్లో అక్కడ స్థిరపడిన తెలుగు వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు పట్టుబట్టలు ధరించి పండగకు కొత్త కళ తీసుకొచ్చారు. రంగురంగుల రంగవల్లికల్ని తీర్చిదిద్దుతూ, సంక్రాంతి థీమ్‌కి తగినట్లుగా-గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా వివిధ రకాల సెట్స్‌ని రూపొందిస్తూ, బొమ్మల కొలువు పేర్చుతూ సందడి చేశారు. ఇక చిన్నారులు ఆటల పోటీలు, క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఆపై తెలుగు సంప్రదాయ వంటకాలతో అరటి ఆకుల్లో విందారగించి పండగ వేడుకల్ని ముగించారు. మరి, తెలుగు సంస్కృతిని, పండగ సంప్రదాయాల్నీ ప్రతిబింబించేలా ఉన్న ఈ ఎన్నారై సంక్రాంతి సంబరాలపై మీరూ ఓ లుక్కేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్