Summer Gardening: నీడలో చల్లగా.. మొక్కలు

వేసవికాలం రాగానే మనమే ఆ వేడికి వాడిపోతాం. అలాంటిది మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఈకాలం వాతావరణంలో మార్పుల కారణంగా పెరట్లోని మొక్కలకు ఎంత నీరందించినా అవి ఎండిపోతాయి.

Published : 03 Apr 2023 00:29 IST

వేసవికాలం రాగానే మనమే ఆ వేడికి వాడిపోతాం. అలాంటిది మరి మొక్కల పరిస్థితి ఏంటి? ఈకాలం వాతావరణంలో మార్పుల కారణంగా పెరట్లోని మొక్కలకు ఎంత నీరందించినా అవి ఎండిపోతాయి. అలాకాకుండా ఉండాలంటే కొన్ని సలహాలు ఇస్తున్నారు గార్డెనింగ్‌ నిపుణులు అవేంటో చూద్దామా.

ఏ మొక్కల్ని అయినా కాలానుగుణంగా పెంచితే... ఆయా వాతావరణాలను తట్టుకోగలవు. మిర్చి, దోసకాయ, వంకాయలాంటి కూరగాయల్ని కూడా వేసవిలో చక్కగా పెంచవచ్చు.

నీడనివ్వండి... దాదాపు మొక్కలకు నీడను ఏర్పాటు చేస్తే మంచిది. నర్సరీలకు ఉపయోగించే పలుచని నెట్‌తో గార్డెన్‌ చుట్టూ, పై భాగంలో కూడా నీడను ఏర్పాటు చేస్తే సూర్యుడి నుంచి వచ్చే ఎండ నేరుగా మొక్కలపై పడకుండా ఉంటుంది. వాటిని అలా కొంత వరకూ సంరక్షించొచ్చు. ఈ తెరలు ఆన్‌లైన్‌లో, నర్సరీల డీలర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. నీడ ఎంత అవసరమో ఏకాలమైనా మొక్కలకు సూర్యరశ్మి కూడా అంతే ముఖ్యం అన్న విషయాన్ని మర్చిపోవద్దు.

ఎక్కువగా తడపాలి.. వేసవిలో నేల ఎక్కువగా పొడి బారి నెర్రెలు ఇస్తుంది. దాంతో మొక్కలు ఎండిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే తోటలోని మట్టి తేమగా ఉండేలా నీటిని అందించాలి. నీళ్లు పెట్టే ముందు ఒకసారి నేలను చేత్తో తాకి చూడాలి. ఎంత తేమ ఉంది? నీరెంత పెట్టాలి అనే విషయం గమనించాకే మరోసారి నీటిని అందించాలి. నీళ్లు కొద్ది కొద్దిగా మొక్కలకు అందేలా మొదళ్లలో పాదులు చేసి నీటిని నింపాలి. గార్డెన్‌లో ఎండిపోయిన చెత్త, ఆకులు అలాగే ఉంచకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అయితే, మొక్కల ప్రూనింగ్‌ ఈ కాలంలో చేయకపోవడమే మంచిది.

అన్నీ కలిపి.. పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలకు నీడను ఇస్తాయి. కాబట్టి పెద్ద వాటి మధ్యలో అక్కడక్కడా చిన్న మొక్కలు నాటుకోవాలి. అప్పుడు చిన్న మొక్కలకు ఎండ తగలకుండా చెట్లు సంరక్షిస్తాయి. ఈ పద్ధతిని పాటించడం వల్ల ఎంత చిన్న మొక్కని అయినా ఎండిపోకుండా కాపాడగలం.

ఎరువులను ఇలా.. మొక్కలకు నీరు ఎంత అవసరమో ఎరువులు కూడా అంతే అవసరం. ప్రత్యేకంగా పూలు, పండ్లు ఇచ్చే మొక్కలకు తప్పకుండా ఎరువులు వేయాలి. ఇంట్లో తయారు చేసిన వర్మీకంపోస్టు, మార్కెట్లో దొరికే సహజ ఎరువులను కూడా ఉపయోగించొచ్చు. అవి మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడతాయి. మీకూ నచ్చాయి కదూ ఈ గార్డెనింగ్‌ చిట్కాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్