Office Gadgets : పాదాలు వాపు రాకుండా..!

ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటాం.. దీనివల్ల సాయంత్రానికి పాదాల్లో వాపు రావడం గమనిస్తుంటాం. గర్భిణుల్లోనూ ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే దీనికి పరిష్కారంగా ఓ ఫుట్‌ స్టాండ్‌ ఏర్పాటుచేసుకోమని నిపుణులు సూచిస్తుంటారు.

Published : 24 Sep 2023 13:07 IST

ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటాం.. దీనివల్ల సాయంత్రానికి పాదాల్లో వాపు రావడం గమనిస్తుంటాం. గర్భిణుల్లోనూ ఈ సమస్య తలెత్తుతుంటుంది. అయితే దీనికి పరిష్కారంగా ఓ ఫుట్‌ స్టాండ్‌ ఏర్పాటుచేసుకోమని నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి ఇది ఒక దగ్గర ఫిక్స్‌ అవడం వల్ల అంత సౌకర్యంగా అనిపించదు. కాళ్లు, పాదాల్ని ఇలా ఒకే భంగిమలో ఎక్కువ సేపు ఉంచడం వల్ల కొన్నిసార్లు నొప్పి వస్తుంటుంది. ఈ సమస్య లేకుండా ఉండడానికే ప్రస్తుతం ‘ఫుట్‌ హామోక్స్‌’ మార్కెట్లోకొచ్చాయి.

చిన్న సైజు ఊయలలా ఉండే వీటిని డెస్క్‌ కింది భాగంలో అమర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి ఇరువైపులా ఉండే బెల్టుకు ఎలాస్టిక్‌ ఉంటుంది. తద్వారా అది కావాల్సినంత సాగుతుంది. ఈ హామోక్‌లో పాదాల్ని ఉంచి.. ముందుకు, వెనక్కి ఆడించడం వల్ల పాదాలకు వ్యాయామం కూడా అవుతుంది. ఇక పని చేస్తున్నప్పుడు పాదాలు కిందికి ఉండేలా, విశ్రాంతి తీసుకునేటప్పుడు పైకి వచ్చేలా కూడా హామోక్‌ను అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. ఇందులోనూ మృదువైన కుషన్‌, స్పాంజి, మక్మల్‌.. వంటి మెటీరియల్స్‌తో తయారైనవి లభిస్తున్నాయి. కాబట్టి వీటితో పాదాలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. రెండు పాదాల్ని విడివిడిగా పెట్టుకోవడానికి వీలుగా ఒకే హామోక్‌లో పార్టిషన్‌ ఉన్నవీ మార్కెట్లో లభిస్తున్నాయి. ఇలా వీటిలో పాదాల్ని ఉంచి పైకి/కిందికి, ముందుకు/వెనక్కి అంటూ వ్యాయామం కూడా చేయచ్చు. అయితే ఇలా ఊయల మాదిరిగానే కాకుండా.. పైకి, కిందికి అడ్జెస్ట్‌ చేసుకునేలా ‘అడ్జెస్టబుల్‌ ఫుట్‌ రెస్ట్‌’లు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని డెస్క్‌ కింద అమర్చుకున్నా సౌకర్యంగా పనిచేసుకోవచ్చు. మరి, అలాంటి ఫుట్‌ హామోక్స్‌, ఫుట్‌ రెస్ట్‌లపై మీరూ ఓ లుక్కేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్