Upasana: ఇలాంటి అమ్మలు, అత్తమ్మలే కావాలి!

నచ్చిన పని చేయడానికి వయసును చూసుకోం.. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తాం.. అలాంటప్పుడు మనసులోని తపనను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధమేముంది అంటోంది ఉపాసన. అందుకు తన అత్తగారు సురేఖనే స్ఫూర్తిగా తీసుకోమంటోందామె.

Published : 09 Mar 2024 20:28 IST

(Photos: Instagram)

నచ్చిన పని చేయడానికి వయసును చూసుకోం.. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తాం.. అలాంటప్పుడు మనసులోని తపనను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధమేముంది అంటోంది ఉపాసన. అందుకు తన అత్తగారు సురేఖనే స్ఫూర్తిగా తీసుకోమంటోందామె. ఆరు పదుల వయసులో వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆమెకు అభినందనలు చెబుతూనే.. ఇలాంటి స్ఫూర్తిదాయక మహిళలందరికీ ‘మహిళా దినోత్సవ’ శుభాకాంక్షలు తెలియజేసిందామె. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

అత్తమ్మా.. మీ స్ఫూర్తికి నా సలామ్!

అత్తాకోడళ్లుగా కంటే తల్లీ కూతుళ్లుగా కలిసిపోతారు సురేఖ కొణిదెల-ఉపాసన. తన అత్తమ్మతో తనకున్న అనుబంధాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది ఉపాసన. తాజాగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మరోసారి తన అత్తగారు, అమ్మమ్మ (రామ్‌చరణ్‌ నానమ్మ)తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న ఆమె.. ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని రాసుకొచ్చింది.

‘ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా అత్తమ్మ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 60 ఏళ్ల వయసులోనూ తన మనసులోని తపనను నెరవేర్చుకొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. అత్తమ్మా! మీ స్ఫూర్తికి నా సలామ్‌. ఇలాంటి అమ్మలు, అత్తమ్మలు ముందుకొచ్చి తమకు నచ్చిన వ్యాపారాలు ప్రారంభిస్తే మన దేశం ఆర్థికంగా ఎంతగా అభివృద్ధి సాధిస్తుందో మీరే ఒక్కసారి ఊహించండి! తమ అభిరుచుల్ని ఆచరణలో పెడుతూ మరింతమంది మహిళలు వృత్తిఉద్యోగాల్లో రాణించాలని కోరుకుంటున్నా.. అందరికీ హ్యాపీ విమెన్స్‌ డే!’ అంది ఉపాసన.

‘అత్తమ్మాస్‌ కిచెన్’..!

వృత్తిఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు, తీరిక లేని పనుల వల్ల ప్రస్తుతం చాలామంది రెడీ-టు-ఈట్‌ ఆహార ప్రత్యామ్నాయాల్ని కోరుకుంటున్నారు. దూర ప్రయాణాల్లో, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడూ సొంతింటి రుచుల్ని మిస్సవుతుంటారు మరికొందరు. అలాంటి వాళ్ల కోసం మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవలే ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ పేరుతో ఓ ఫుడ్‌ బ్రాండ్‌ని ప్రారంభించారు. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా, ఇంటి రుచులకు అనుగుణంగా, నాణ్యమైన డ్రై హోమ్‌ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్