చర్మం బిగుతుగా మారాలంటే..!

చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడే చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఫలితంగా మరింత అందంగా కనిపించే వీలు ఉంటుంది. అయితే మారుతున్న జీవన విధానాలు, రోజువారీ పనుల్లో ఎదుర్కొనే.....

Published : 01 May 2023 12:32 IST

చర్మం బిగుతుగా, ప్రకాశవంతంగా ఉన్నప్పుడే చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. ఫలితంగా మరింత అందంగా కనిపించే వీలు ఉంటుంది. అయితే మారుతున్న జీవన విధానాలు, రోజువారీ పనుల్లో ఎదుర్కొనే ఒత్తిడి, నిద్రలేమి.. వంటి పలు కారణాల వల్ల చర్మం నిర్జీవంగా మారడమే కాకుండా వదులుగా కూడా అయిపోతుంది. మరి, ఇలా వదులైపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చేదెలా? తిరిగి చర్మం జీవం పోసుకోవాలంటే ఎలాంటి ప్యాక్స్ వేసుకోవాలి? తెలుసుకుందాం రండి..

పాలు, ముల్తానీ మట్టితో..

కొద్దిగా ముల్తానీ మట్టి తీసుకొని అందులో వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలు 2 చెంచాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్త్లె చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మం బిగుతుగా మారడమే కాదు.. చర్మం పైపొరల్లో పేరుకొన్న మలినాలు తొలగిపోయి, మృదుత్వాన్ని కూడా సంతరించుకొంటుంది.

కలబందతో..

కలబంద గుజ్జు కొద్దిగా తీసుకొని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. చర్మంపై పేరుకొన్న మలినాలను తొలగించడమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మారేలా చేస్తుంది. అలాగే కోడిగుడ్డులోని తెల్లసొన, కలబంద కలిపి ప్యాక్‌లా అప్త్లె చేసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం బిగుతుగా మారడంతో పాటు, అందంగా కూడా కనిపిస్తుంది.

పెరుగు, కోడిగుడ్డులోని తెల్లసొనతో..

కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకొని అందులో చెంచా పెరుగు, చిటికెడు చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. పెరుగు చర్మానికి అవసరమయ్యే తేమని అందిస్తే, కోడిగుడ్డులోని తెల్లసొన చర్మం బిగుతుగా మారేలా చేస్తుంది. చక్కెర స్క్రబ్‌లా పనిచేసి చర్మం పైపొరల్లో పేరుకొన్న మలినాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్