మెడ వద్ద చర్మం బిగుతుగా ఇలా..!

వయసు పెరుగుతున్న కొద్దీ మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వీటికి చెక్‌ పెట్టి యవ్వనంగా కనిపించాలంటే కొన్ని.....

Published : 04 Jun 2023 16:43 IST

వయసు పెరుగుతున్న కొద్దీ మెడ వద్ద చర్మం వదులుగా మారి ముడతలు పడడం, సన్నని గీతలు రావడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వీటికి చెక్‌ పెట్టి యవ్వనంగా కనిపించాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు సౌందర్య నిపుణులు.

మర్దన మృదువుగా..!

ముందుగా గోరువెచ్చని నీళ్లతో, ఆపై నూనె రహిత క్లెన్సర్‌తో ముఖం, మెడ భాగాలను శుభ్రం చేసుకోవాలి. ఆపై కొద్దిగా ఆలివ్ నూనె తీసుకొని చేతి మునివేళ్ల సహాయంతో ఈ నూనెను మెడ వద్ద అప్లై చేస్తూ గుండ్రంగా రుద్దుతూ రెండు నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఇలా మెడ చుట్టూ ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల అక్కడి చర్మకణాలకు సహజ తేమ అందడమే కాకుండా వదులైన చర్మం తిరిగి బిగుతుగానూ మారుతుంది.

వ్యాయామం..

మెడ భాగానికి సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం ద్వారా అక్కడ ఉన్న చర్మకణాలు పునరుత్తేజితమవుతాయి. ఫలితంగా కొలాజెన్‌ ఉత్పత్తై అక్కడ చర్మం బిగుతుగా మారుతుంది. తద్వారా మెడ భాగం వద్ద చర్మంపై ఉండే ముడతలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారుతుంది.

తెల్లసొన, తేనెతో..

కోడిగుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ అప్లై చేసుకోవడం వల్ల త్వరితగతిన ఫలితం ఉంటుంది.

పెరుగు, నిమ్మరసంతో..

రెండు చెంచాల పెరుగులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా అప్త్లె చేసుకోవాలి. తర్వాత చేతి వేళ్ల సహాయంతో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేసుకోవాలి. అనంతరం ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

కలబందతో..

కలబంద గుజ్జు, మయోనైజ్, తేనె.. ఈ మూడూ చెంచా చొప్పున ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వద్ద ప్యాక్‌లా వేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలోనే మెడపై ఉన్న ముడతలు తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్