
క్యాన్సర్ అని తెలిసినా.. నిన్నే ప్రేమించా.. పెళ్లాడతానన్నాడు!
తెలిసీ తెలియని వయసులో ప్రేమంటే అదంతా వట్టి ఆకర్షణ అని కొట్టిపడేస్తుంటాం. కానీ స్కూలింగ్ నుంచే వారిద్దరూ మంచి స్నేహితులు.. ఒక రోజు కనిపించకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా వారి మనసులో ఏదో వెలితిగా అనిపించేది. కానీ అదే ప్రేమని, ఆకర్షణను మించిన అందమైన అనురాగ బంధమని విడిపోయాక కానీ తెలుసుకోలేకపోయారు. మరి, చదువు, వృత్తి-ఉద్యోగాల రీత్యా వేర్వేరు చోట్ల స్థిరపడ్డ వారు.. ఆ తర్వాత మళ్లీ కలుసుకున్నారా? తమ మనసులోని మాటలను పంచుకున్నారా? లేక ‘ఎవరికి వారే యమునా తీరే..!’ అంటూ ఎవరి దారి వారు చూసుకున్నారా? విధి ఆడిన వింత నాటకంలో ఇంతకీ వీరి ప్రేమకథ నెగ్గిందా? ఓడిపోయిందా? తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రేమికురాలు చెప్పే ప్రేమకథ వినాల్సిందే!
హాయ్.. నా పేరు ఆకాంక్ష. మాది హైదరాబాద్. ప్రస్తుతం ఇక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. సాధారణంగా స్కూలింగ్‌లో మనకు బోలెడంతమంది ఫ్రెండ్స్ అవుతుంటారు. అందులో అమ్మాయిలే కాదు.. అబ్బాయిలూ ఉంటారు. వీరిలో ఎవరో ఒకరిపై ఫస్ట్ క్రష్ అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఏడో తరగతిలో ఉన్నప్పుడు నాకు అభిరామ్‌పై కలిగిన భావన కూడా అలాంటిదే! అలాగని అది ఆకర్షణ అనుకుంటే మీరు పొరపడినట్లే! ఎందుకంటే తెలిసీ తెలియని వయసులో పుట్టేది ప్రేమ కాదు.. ఆకర్షణ అని చాలామంది అనుకుంటుంటారు.. కానీ అలాంటి ఫస్ట్ క్రష్‌లోనూ నిజమైన ప్రేమ దాగుందని చెప్పడానికే ఈ ‘వేలంటైన్స్ డే’ సందర్భంగా నా ప్రేమకథను మీతో పంచుకోవడానికి ఇలా మీ ముందుకొచ్చా.
నన్ను ఏడో తరగతిలో అమ్మానాన్న వేరే స్కూల్లో చేర్పించారు. ఎంతైనా ఒక స్కూల్ నుంచి మరో స్కూల్‌కి మారినప్పుడు అక్కడి ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అన్న భయం ఉండడం సహజం. మొదట్లో నేనూ అలాగే భయపడ్డా.. కానీ కొత్త స్కూల్లో ఫ్రెండ్సంతా ఎంతో సరదాగా ఉండేవారు. దాంతో అసలు స్కూలుకెళ్లిన భావనే కలిగేది కాదు. అభిరామ్ కూడా సేమ్ క్లాస్, సేమ్ సెక్షన్. తను చాలా కామ్, సున్నిత మనస్కుడు.. ఎవరు ఏమడిగినా లేదనకుండా ఇచ్చేవాడు.. పైగా చదువులో మహా చురుకు!. బహుశా.. అదే నాకు తనపై ఫస్ట్ క్రష్ ఏర్పడేలా చేసిందేమో అనిపిస్తుంది ఇప్పటికీ! ఇక నేనేమో అభికి పూర్తి భిన్నం. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం కావడంతో వారు మరింత గారాబం చేశారు. అలా ఇంట్లో చేసే అల్లరిని స్కూల్ దాకా మోసుకెళ్లేదాన్ని. ఇక నా అల్లరికి, అభి కామ్‌నెస్‌కి భలే సరిపోయింది.. మేమిద్దరం తక్కువ సమయంలోనే మంచి స్నేహితులమయ్యాం.
******
తరగతి మారుతున్న కొద్దీ మా మధ్య స్నేహం కూడా అంతకంతకూ రెట్టింపైంది. అలా చూస్తుండగానే పదో తరగతి పరీక్షలు దగ్గరపడ్డాయి. ఆ సమయంలో పరీక్షలంటే భయమేమోగానీ.. ఆ తర్వాత అభిని మిస్సవుతానన్న బాధే నా మనసంతా నిండిపోయింది. ఏదో రాయాలి అన్నట్లుగా పరీక్షలు రాశాను. అప్పటిదాకా అభి నన్ను ఓ మంచి ఫ్రెండ్‌లాగానే చూశాడేమో అనుకున్నా.. కానీ వీడ్కోలు సమావేశంలో అతనికీ నేనంటే ఏదో తెలియని ఫీలింగ్ ఉందని అతని కళ్లలోకి చూస్తేనే అర్థమైంది. నన్ను వీడలేక వీడిపోతున్నాడేమో అనిపించింది. ఏదేమైనా ఇక తప్పదు కదా.. అన్నట్లుగా వీడలేక వీడలేక విడిపోయాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోసం నన్ను చెన్నైలోని మా బాబాయి వాళ్లింటికి పంపించారు అమ్మానాన్న. ఇక అభిని వాళ్ల పేరెంట్స్ అమెరికా తీసుకెళ్లిపోయారు. ఫోన్ చేద్దామంటే తన మొబైల్ నంబర్ మారిపోయింది.. తన ఫోన్‌లో నా నంబర్ పోయిందట.. సో.. ఇద్దరి మధ్య ఉన్న ఆ ఒక్క వారధి అలా కట్ అయిపోయింది.
అయినా అభి అమెరికా వెళ్లిపోయాడు.. అక్కడి కల్చర్, లైఫ్‌స్టైల్ అన్నీ విభిన్నం. ఇక నన్నెక్కడ గుర్తుపెట్టుకుంటాడు.. అనుకునేదాన్ని. అయినా ‘ఛ.. ఛ.. అభి ఎప్పుడూ అలా చేయడు..’ అంటూ ఆ వెంటనే నా మనసుకు సర్దిచెప్పుకునేదాన్ని. ఇలా ఏం చేసినా, ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడినా నా మనసంతా అభి గురించిన ఆలోచనలే! ఇలా నేనిక్కడ.. అభి అక్కడ.. ఏళ్లు గడిచిపోయాయి.. ఎంసీఏ పూర్తి చేసి ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించా. ఎందుకో హైదరాబాద్ అయితే అభికి దగ్గరగా ఉన్నట్లనిపించేది.. అందుకే నా జాబ్ లొకేషన్ కూడా ఇక్కడే పెట్టుకున్నా. అయితే ఒకసారి అమ్మానాన్నలతో కలిసి మా దూరపు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాను. అక్కడ ఒక వ్యక్తిని చూడగానే అభిని చూసిన ఫీలింగే కలిగింది. అయినా తనిక్కడ లేడు కదా అనుకున్నా. అతనూ నన్ను తదేకంగా కాసేపు అలాగే చూశాడు. కాసేపటి తర్వాత తనే నా దగ్గరికొచ్చి ‘హే.. నువ్వు ఆకాంక్ష కదా.. నేను అభి.. మనిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం.. గుర్తుపట్టలేదా?’ అన్నాడు.. పోయిన నా ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చినట్లనిపించింది. ఇక ఆలస్యం చేయకూడదు.. ఇన్నాళ్లూ అతడిని ఎంతలా మిస్సయ్యానో చెబుదామన్నంత ఆతృత నాలో కలిగింది. కానీ అది సమయం, సందర్భం కాదని ఆగిపోయా.
******
అతడిని చూసిన ఆనందంలో అసలు అతనికి, ఆ ఫంక్షన్‌కి సంబంధమేంటన్న విషయమే అడగడం మర్చిపోయా! ఆ తర్వాత అమ్మానాన్నలే చెప్పారు.. మేం వెళ్లింది అభి వాళ్ల కజిన్ పెళ్లికేనని! సో.. ఏదైతేనేం.. మళ్లీ అభిని చూశానన్న ఆనందంతో నా మనసంతా ఉక్కిరిబిక్కిరైంది. ఇక ఫంక్షన్ నుంచి ఇంటికొచ్చేటప్పుడు ఇద్దరం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆ తర్వాత ఫోన్ ముట్టుకున్న ప్రతిసారీ అభికి కాల్ చేద్దాం అనుకోవడం.. చేస్తే తనేమనుకుంటాడోనని ఆగిపోయేదాన్ని. ఇలా నా ఎదురుచూపులకు ఓ రోజు అభినే తెరదించాడు. తనే నాకు ఫోన్ చేసి.. ఇన్నాళ్లూ నిన్నెంతో మిస్సయ్యానన్నంత ప్రేమగా మాట్లాడాడు. నిజానికి తను కూడా ఇండియా రావాలనే ప్లాన్‌లో ఉన్నానన్నాడు. అలా కొన్నాళ్లు మా మధ్య మూగ ప్రేమ సంభాషణలు నడిచాయి. ‘ఇండియా వచ్చాక నిన్ను ఒక రోజు ప్రత్యేకంగా కలవాలి.. నా మనసులోని మాటలన్నీ నీతో చెప్పాలి..’ అన్నాడు.. నాదీ అదే ఫీలింగ్.. అని మనసులోనే అనుకున్నా. ఇక అతని రాకకోసం కళ్లల్లో వత్తులేసుకొని మరీ ఎదురుచూడడం మొదలుపెట్టా. కానీ ఆ ఎదురుచూపులు మరికొన్నాళ్లు ఆలస్యమవుతాయని, చేదు అనుభవాలను మిగుల్చుతాయని ఆ క్షణం నేనే కాదు.. ఎవరూ ఊహించరు.
ఇండియా వచ్చే క్రమంలో కారులో ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న అభికి పెద్ద ప్రమాదం జరిగిందని.. దాంతో తీవ్ర గాయాలతో అతను అక్కడే ఆస్పత్రిలో చేరాడంటూ నాకు సమాచారం అందింది. ఆ క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది. ఇన్నాళ్లూ నా ఎదురుచూపులకు ఫలితం ఇదా అంటూ కుమిలిపోయా.. అభికి ఏమీ కాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థించా. నిజంగానే ఆ దేవుడి దయేనేమో! అతడి ప్రాణానికి ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారనడంతో ఊపిరి పీల్చుకున్నా. తనను చూడాలనిపించినా.. అతనున్నది అమెరికాలో.. నేనున్నది ఇండియాలో.. అంతదూరం వెళ్లలేని పరిస్థితి.. ఒకవేళ నేను వెళ్దామనుకున్నా అమ్మానాన్న పంపరు. ఇలాంటి ప్రతికూలతల నడుమ ఇక్కడే ఆగిపోయా. తన పరిస్థితి ఇప్పుడెలా ఉందో..? తిన్నాడో, లేదోనని అనుక్షణం అతడి ధ్యాసలోనే ఉండేదాన్ని. అప్పటికి తనకు ప్రమాదం జరిగి రెండు నెలలు గడిచిపోయింది. ఈ మధ్యలోనే నా జీవితంలో మరో ఉపద్రవం వచ్చి పడింది. నాకు రొమ్ము క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయింది. ఈ వ్యాధి మూడో దశలో ఉందని, ఆపరేషన్ ద్వారా ఎడమ రొమ్మును పూర్తిగా తొలగించాలని, లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు డాక్టర్లు. హతవిధీ.. ఏంటి భగవంతుడు నాకు పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు.. ఈ విషయం అభితో ఎలా చెప్పాలి? అన్న సందిగ్ధంలో పడిపోయా.
******
అంతలోనే అభి దగ్గర్నుంచి ఫోన్.. ‘నేను ఇండియాకొచ్చేశా.. రేపే నిన్ను కలవాలి.. అని చెప్పాడు. ఒకవేళ అభి నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పినా నేను ఒప్పుకోను.. నా మూలంగా తన జీవితం నాశనం కాకూడదు అని గుండె రాయి చేసుకున్నా. అతను నన్ను కలవాలన్న రోజు ఫిబ్రవరి 14 అంటే వేలంటైన్స్ డే.. అనుకున్నట్లుగానే అభిని కలవడానికి వెళ్లాను. నాకోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురుచూస్తున్నంత సంతోషంతో ఉన్నాడు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను.. ఇక నా మనసులోని మాట నీతో చెప్పేస్తా అంటూనే ఐలవ్యూ అనేశాడు. టెన్త్ క్లాస్‌లో మనిద్దరం విడిపోయినప్పుడే నిన్నెంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది.. నా మీద నీ అభిప్రాయమేంటి అని అడిగాడు. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. నా మనసులో తనపై చెప్పలేనంత ప్రేమ ఉన్నా.. ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు..’ అనేశా! నువ్వు అబద్ధం చెబుతున్నావ్.. నీ కళ్లు చెబుతున్నాయి.. నువ్వు నన్నెంత ప్రేమిస్తున్నావో అంటూ నా బాధేంటో చెప్పేదాకా అక్కడ్నుంచి నన్ను వెళ్లనివ్వలేదు. నాకు క్యాన్సర్ అన్న విషయం తెలిసినా.. అప్పటికీ నామీద తనకున్న ప్రేమ తగ్గలేదని తన మాటలు వింటేనే అర్థమైంది.
నా జీవితంలో నేను వలచింది, వరించింది నిన్నే.. పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అన్నాడు.. నాతో చెప్పడమే కాదు.. మా ఇంటికొచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడాడు, వారిని ఒప్పించాడు కూడా! అలా ప్రేమికుల దినోత్సవం రోజున మా మనసుల్లో దాగున్న ప్రేమను తెలుపుకోవడమే కాదు.. దాన్ని శాశ్వతమైన అనుబంధంగా మార్చుకునేందుకు బాటలు వేసిన ఆ రోజు మా జీవితాల్లో ఎప్పటికీ ప్రత్యేకమే! ప్రస్తుతం నేను క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నా.. మరో రెండు నెలల్లో నాకు, అభికి పెళ్లి చేయాలని మా పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. ఇలా మొత్తానికి నేను కోరుకున్న అభితో నా పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. అయితే చివరగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా..
ప్రేమకు వయసుతో పనిలేదు.. పరిస్థితులకు తలొగ్గదు.. అది ఏ వయసులో పుట్టినా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటూ.. నిజమైన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది.. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మా ప్రేమకథే! మీరు కూడా మీ ప్రేమను మధ్యలో వదిలేయకుండా, ఎదుటివారిని బాధపెట్టకుండా.. ఆ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోండి..!
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని

పండంటి జీవితానికి పంచ సూత్రావళి
కథలూ, సినిమాలకు మల్లే నవ్వుతూ తుళ్లుతూ కబుర్లు చెప్పుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని జంటలే అలా అన్యోన్యంగా ఉండగలుగుతున్నాయి. అధికశాతం పిల్లీ ఎలుకల్లా కయ్యానికి కాలు దువ్వుకోవడం, మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువ. ఈ నేపథ్యంలో భార్యాభర్తల్లో గొడవకు దారి తీసే అంశాలు ముఖ్యంగా ఐదని, వాటిని తేలిగ్గానే నివారించవచ్చని చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. అవేంటో మీరూ చూడండి...తరువాయి

వేధింపులకు గురవుతున్నారేమో..
లలిత కూతురు కాలేజీ నుంచి రావడమే.. గదిలోకి వెళ్లిపోతుంది. పిలిచినా పలకదు. ఎవరితోనూ ఏమీ చెప్పదు. ఏదో కోల్పోయినట్లుగా ఉంటుంది. ఈ తరహా ప్రవర్తన వేధింపులకు గురయ్యేవారిలోనూ కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఇవన్నీ వారి మానసిక సంఘర్షణకు సంకేతాలు కావొచ్చని హెచ్చరిస్తున్నారు.తరువాయి

Ranbir-Alia: అప్పుడే పిల్లల గురించి ఆలోచించాం..!
పెళ్లయ్యాక పిల్లలు పుడితే ఏ పేరు పెట్టాలి? వాళ్లను ఎలా పెంచాలి? ఏం చదివించాలి?.. ఇలాంటి విషయాల గురించి కొంతమంది పెళ్లికి ముందే ఆలోచిస్తుంటారు. తామూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు బాలీవుడ్ లవ్లీ కపుల్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్. ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన....తరువాయి

చిట్టి మనసుల్లో కలతలొద్దంటే..
కమలకు ఇద్దరు పిల్లలు పుట్టారనే సంతోషం నాలుగేళ్లకే ఆవిరైపోయింది. ఒకరి బొమ్మలు మరొకరితో పంచుకోకపోవడం, ఇద్దరూ ఎదుటివారిపై అసూయతో నిత్యం గొడవపడటం, నువ్వెందుకు వచ్చావ్.. అనే స్థాయికి చేరింది వారి ప్రవర్తన. దీన్ని మొగ్గలోనే తుంచాలంటున్నారు నిపుణులు. వారిమధ్య బాల్యం నుంచే ప్రేమానుబంధాల్ని పెంచాలంటున్నారు.తరువాయి

అనుబంధం పెంచుకోండిలా
రాగిణి, భగత్‌లు ప్రేమవివాహంతో ఒక్కటైన జంట. ఉద్యోగులు కావడంతో కాసేపైనా కలిసి మాట్లాడుకోవడానికి సమయం ఉండదు. ఇరువురి మధ్య దూరం పెరుగుతోందేమో అనే ఆలోచన రాగిణిని బాధపెడుతోంది. ఉదయం వర్కవుట్లు, వారాంతాల్లో తోటపని వంటివి జంటగా కలిసి చేయడానికి ప్రయత్నిస్తే ఆ క్షణాలు ఇరువురి మధ్య అనుబంధాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు...తరువాయి

టీనేజ్ పిల్లలతో ఎలా ఉంటున్నారు?
కాలం మారుతున్న కొద్దీ పిల్లలను పెంచే పద్ధతులు మారిపోతున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల విషయంలో కొంతమంది తల్లిదండ్రులకు సవాల్‌గా మారుతోంది. నేటి తరంలో కొంతమంది పిల్లలు చిన్న చిన్న విషయాలకు కూడా తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. తమకు కావాల్సిన వాటిని పొందడానికి.....తరువాయి

అమిత కోపాన్ని నియంత్రిస్తేనే...
సుమిత్ర ఎనిమిదేళ్ల కూతురికి కోపం వచ్చిందంటే ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురేే. ఎవరేం చెప్పినా వినదు. తోటి పిల్లలతో కలవదు. ఈ అమిత కోపం వెనుక తీవ్రమైన మానసిక సంఘర్షణ ఉండొచ్చంటున్నారు నిపుణులు. చిన్నప్పటి నుంచే కోపాన్ని నియంత్రించాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రుల అమిత గారం పిల్లల్లో మొండితనాన్ని పెంచుతుంది. కోపం చూపిస్తే లేదా ఏడిస్తే అమ్మానాన్నలు కావాల్సింది ఇస్తారని...తరువాయి

ఇవీ ఆరా తీయండి!
జీవితంలో పెళ్లి ఓ పెద్ద మలుపు... మార్పు. పెట్టిపోతలు పెద్దవాళ్లు మాట్లాడుకుంటారు సరే... ఇష్టాయిష్టాలూ పంచుకుంటారు. మరి వచ్చిన అబ్బాయితో భవిష్యత్ గురించి చర్చించారా? సొంత వ్యాపారం, ఉన్నత చదువులు, వృత్తిలో ఎదగడం, ప్రపంచం చుట్టేయడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. మీదేంటి? పంచుకోండి. అవతలి వ్యక్తిదీ తెలుసుకోండి. ఉదాహరణకు మీకు...తరువాయి

Rape Survivor : వావి వరసలు మరిచి తన పశువాంఛ తీర్చుకున్నాడు!
ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా అనుకున్న వాళ్లు, కుటుంబీకులే ఇలాంటి....తరువాయి

భవిష్యత్తులో బాధపడొద్దంటే..
కలకాలం నిలవాలనే ఉద్దేశంతోనే వివాహ బంధంలోకి అడుగుపెడతామెవరైనా. కానీ కొన్ని సందర్భాల్లో కొద్దికాలానికే పొరపొచ్చాలు వస్తుంటాయి. విడిపోవడానికీ కారణం అవుతుంటాయి. దీనికి సంబంధించిన సూచనలు పెళ్లికి ముందు నుంచే తెలుస్తాయంటారు నిపుణులు. కాస్త గమనించాలంతే! అవేంటో.. తెలుసుకోండి.తరువాయి

Relationship Milestones : పెళ్లికి ముందు ఈ విషయాల్లో స్పష్టత అవసరం!
పెళ్లనేది శాశ్వతమైన అనుబంధం. అందుకే అది ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా అన్నీ కుదిరాకే అడుగు ముందుకేస్తారు ఇరు కుటుంబ సభ్యులు. అయితే ఇలా పెద్దలకే కాదు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే జంటకూ.. ముందే కొన్ని విషయాల్లో స్పష్టత.....తరువాయి

పాలిచ్చే తల్లులూ.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పసి పిల్లలకు తల్లిపాలే ప్రాణాధారం అన్న విషయం తెలిసిందే. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర్నుంచి వారికి సంవత్సరం లేదా సంవత్సరంన్నర వయసొచ్చేదాకా తల్లులు పాలిస్తూనే ఉంటారు. ఇది కేవలం బిడ్డకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది. అయితే ఈ సమయంలో తల్లి చేసే.....తరువాయి

#WikkiNayan : ఏడేళ్ల ప్రేమ సాక్షిగా.. ఏడడుగులు వేశారు!
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో......తరువాయి

Dead Bedroom: ఆ ‘కోరికలు’ కొండెక్కుతున్నాయా?
ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం.. ప్రేమగా మాట్లాడుకుంటారు.. ఫ్యాంటసీలనూ పంచుకుంటారు.. కానీ ఏం లాభం..? అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అవును.. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారట. ఒకే పడకగదిలో ఉన్నా.. తరచూ శృంగార జీవితాన్ని ఆస్వాదించే....తరువాయి

ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయను?
మేడమ్.. నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నా... నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నా స్నేహితులు వద్దన్నా వినకుండా అతన్ని నమ్మాను. అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అతను మంచివాడు కాదని తెలిసింది. దాంతో నేను అతనిని వదిలేద్దాం....తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
- మొటిమలకు.. కలబంద!
- కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
ఆరోగ్యమస్తు
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
'స్వీట్' హోం
- పిల్లలు తక్కువ బరువుంటే..
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- Notice Period: ఉద్యోగం మానేస్తున్నారా?
- ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
- కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు