close
బాలీవుడ్
‘బట్టతల ఉంటే కూల్‌గా ఉంటారు’

నటి యామీ గౌతమ్‌

ముంబయి: బట్టతల ఉన్న వ్యక్తులు చాలా కూల్‌ ఉంటారన్నారు నటి యామీ గౌతమ్‌. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘బాలా’ సినిమాలో ఆమె నటించారు. ఆ చిత్రంలో యామీ ‘టిక్‌ టాక్‌ క్వీన్‌’గా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా విలేకరి.. నిజజీవితంలో బట్టతల ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ‘ఎందుకు చేసుకోకూడదు. నా దృష్టిలో బట్టతలతో ఉన్న వ్యక్తులు చాలా కూల్‌గా ఉంటారు. మేము ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కారణం మనుషులు మొదట తమని తాము ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఎదుటవారి నుంచి ప్రేమను ఆశించాలి. కౌశిక్‌ మంచి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ‘బాలా’ టీం ముందుగానే అనుకున్నాం. చిత్ర విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది మాకు కాల్స్‌, మెసేజ్‌లు చేసి అభినందిస్తున్నారు. ‘టిక్‌టాక్‌ క్వీన్‌’ పాత్రలో నేను నటించడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో ఇది ఓ విభిన్నమైన పాత్ర’ అని యామీ తెలిపారు. 

అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహించిన ‘బాలా’ చిత్రంలో ఆయుష్మాన్‌ ఖురాన బట్టతలతో బాధపడే ఓ యువకుడి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో భూమి పడ్నెకర్‌ కీలకపాత్రలో కనిపించారు. నవంబర్‌ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.52.21 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.