విడిగా ఉంటున్నారా...

స్నేహితులతో కలిసి వేరే ప్రాంతంలో వసతిగృహాల్లో ఉండటం....

Updated : 22 Nov 2022 14:20 IST

స్నేహితులతో కలిసి వేరే ప్రాంతంలో వసతిగృహాల్లో ఉండటం ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు చేసేదే. అలా ఉన్నప్పుడు మీ వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా ఉండాలన్నా, మీకు సమస్యలు ఎదురు కాకూడదనుకున్నా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే...
చ్చిపుచ్చుకోవడం, అదేనండీ.. షేరింగ్‌తోనే స్నేహితులు పెరుగుతారు. అది కేవలం ఆహారం విషయంలోనే కాదు.. చదువులో సాయం, సమస్యల్లో అండగా ఉండటం.. చెప్పుకుంటూ పోతే.. ఇలా చాలానే ఉంటాయి. కాబట్టి ఈ నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే.
* మొహమాటం ఉండాలి కానీ అన్నిసార్లు కాదు. రాత్రిళ్లు స్నేహితులతో పాటు మెలకువగా ఉండటం, మొహమాటానికి పోయి వాళ్ల ప్రాజెక్టు పనులు చేసిపెట్టడం... వంటి విషయాల్లో మొహమాటం పనికిరాదు. మీకు వేరే పనులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పి సున్నితంగా తప్పుకోండి. లేదంటే పనిభారం మీపై పడొచ్చు. అలాగే చాలామంది వారాంతాల్లో సినిమాలకు వెళ్లడం, అదేపనిగా డబ్బు ఖర్చుచేయడం.. చాలాచోట్ల కనిపించేదే. అలాంటివాటికి దూరంగా ఉండాలంటే.. చదువుకోవాలనో, మరేదయినా పని ఉందనో స్పష్టంగా చెప్పండి అంతే తప్ప మొహమాటానికి పోయి వారు చెప్పినవన్నీ చేసేయకండి.
* మీకు సంబంధించిన వస్తువులు పంచుకునే అలవాటు ఉంటే.. పంచుకోండి. దాన్నే కొనసాగించండి. లేదా ముందే మీకు అలా ఇష్టం ఉండదని మృదువుగా చెప్పేయండి అంతేతప్ప కొన్నాళ్లు పంచుకుని.. ఆ తరవాత నా వస్తువులు వాడొద్దు.. అని చెప్పడంలో అర్థం ఉండదు.
* అందరూ పడుకున్నాక ఫోన్లు మాట్లాడటం లేదా చదువుకోవడం మీకు అలవాటు అయితే.. వీలైనంతవరకూ మిగిలిన వాళ్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అలాగే ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే గది బయటకు వెళ్లి మాట్లాడటం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్