Winter Gadgets: పాపాయికి వెచ్చవెచ్చగా!

చలికాలం మొదలవుతోంది.. ఇంట్లో ఉన్నా, బయటికొచ్చినా వెచ్చదనాన్ని అందించే దుస్తులు, స్వెటర్లు ఎంచుకుంటాం.. పడుకునేటప్పుడూ బ్లాంకెట్స్‌, రగ్గులు ఉండాల్సిందే! మరి, మన సంగతి సరే.. కానీ ఎంత కప్పినా దుప్పటి తన్నేసుకునే బుజ్జాయిల పరిస్థితేంటి?

Published : 28 Oct 2023 20:45 IST

చలికాలం మొదలవుతోంది.. ఇంట్లో ఉన్నా, బయటికొచ్చినా వెచ్చదనాన్ని అందించే దుస్తులు, స్వెటర్లు ఎంచుకుంటాం.. పడుకునేటప్పుడూ బ్లాంకెట్స్‌, రగ్గులు ఉండాల్సిందే! మరి, మన సంగతి సరే.. కానీ ఎంత కప్పినా దుప్పటి తన్నేసుకునే బుజ్జాయిల పరిస్థితేంటి? అలాగని పదే పదే వారికి కప్పుతూ మనం రాత్రంతా మెలకువతో ఉండలేం. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా, వారు దుప్పటి తన్నేసుకోకుండా ర్యాప్‌ చేసే ‘బేబీ బ్లాంకెట్‌ ర్యాపర్స్‌’/‘స్వాడిల్‌ ర్యాపర్స్‌’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

మెత్తటి ఉన్నితో తయారు చేసినవి, ఊలుతో అల్లినవి, ఫర్‌తో హంగులద్దినవి.. వివిధ డిజైన్లలో చాలానే దొరుకుతున్నాయి. వీటిలోనూ పాపాయి తలకు చలి తగలకుండా హుడీ జత చేసినవి, కాళ్లు సౌకర్యవంతంగా పెట్టుకునేలా ప్యాంట్‌ తరహాలో ఉన్నవీ లభిస్తున్నాయి. మనం చేయాల్సిందల్లా ఈ ర్యాపర్‌లో పాపాయిని పడుకోబెట్టి.. ర్యాప్‌ చేయడం, చివర్లలో ఉన్న స్టిక్కర్స్‌తో స్టిక్‌ చేయడం, బటన్స్‌ పెట్టేయడం లేదంటే జిప్‌ పెట్టేయడం.. వంటివి చేయచ్చు. ఇవి పాపాయికి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు.. అటూ ఇటూ దొర్లినా ర్యాపర్‌ చెదిరిపోకుండా వెచ్చదనం పంచుతాయి. తద్వారా వారికీ హాయిగా నిద్ర పడుతుంది.. మనమూ ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. ఇలా వాళ్లు పడుకున్నప్పుడే కాదు.. కూర్చున్నప్పుడూ వదులుగా ఉంటూ వారిని చుట్టేసే ర్యాపర్లూ దొరుకుతున్నాయి. అలాంటి బేబీ ర్యాపర్స్/స్వాడిల్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి మరి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్