బాత్‌సాల్ట్‌తో ఒత్తిడిని తగ్గిద్దాం..

సరిగా నిద్ర పట్టడం లేదు, ముఖం కళ తప్పుతోంది.. ఒత్తిడి కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఇలాంటప్పుడు ఎప్సమ్‌ సాల్ట్‌ని వాడి చూడండి. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ సముద్ర ఉప్పు మీ మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

Updated : 01 Nov 2023 13:25 IST

సరిగా నిద్ర పట్టడం లేదు, ముఖం కళ తప్పుతోంది.. ఒత్తిడి కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. ఇలాంటప్పుడు ఎప్సమ్‌ సాల్ట్‌ని వాడి చూడండి. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ సముద్ర ఉప్పు మీ మనసుకి, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.

  • స్నానపు నీటిలో గుప్పెడు ఎప్సమ్‌ సాల్ట్‌ని చేర్చుకుంటే శరీరం సాంత్వన పొందుతుంది.  దీనిలోని ఖనిజ లవణాలు కండరాలను విశ్రాంతపరుస్తాయి. నాడీవ్యవస్థకు ఉపశమనం కలిగిస్తాయి. దీంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. బాత్‌సాల్ట్‌ చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేసి వ్యర్థాలను బయటకు పంపుతుంది.
  • నిద్రించే ముందు నీటిలో కొద్దిగా బాత్‌సాల్ట్‌ని కలిపి స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది. ఇది మెలటోనిన్‌ ఉత్పత్తిని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. అలాగే ఈ ఎప్సమ్‌ సాల్ట్‌ ఆర్థరైటిస్‌ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. క్రీడాకారులకు, రోజంతా పనిచేసి అలసిపోయినవారికి ఇది చక్కని ఉపశమనం కలిగిస్తుంది. బాత్‌సాల్ట్‌లో ఖనిజాలు.. రక్తప్రసరణను మెరుగుపరిచి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్