అందానికి ‘టీ’..!

కొంతమంది తమ రోజును బ్లాక్‌ లేదా గ్రీన్‌టీతో ప్రారంభిస్తారు. కానీ అదే టీని మన సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసా..!

Published : 10 Feb 2024 12:36 IST

కొంతమంది తమ రోజును బ్లాక్‌ లేదా గ్రీన్‌టీతో ప్రారంభిస్తారు. కానీ అదే టీని మన సౌందర్య సంరక్షణ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసా..!

చర్మం పొడిబారినప్పుడు నిర్జీవంగా కనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చల్లని గ్రీన్‌టీతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మురికి తొలగిపోయి, చర్మం పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది.

వాడేసిన టీ-బ్యాగులను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని కాసేపు కళ్లపై పెట్టుకొని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్ల వాపు తగ్గుతుంది. నల్లటి వలయాల సమస్య కూడా దూరం అవుతుంది.

తలస్నానం చేసే ముందు బ్లాక్ టీని తలంతా రాసుకోవాలి. పది, పదిహేను నిమిషాల తరువాత షాంపూతో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు చిట్లడం తగ్గుతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది.

వ్యాక్సింగ్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు చర్మం ఎర్రగా కందిపోయి దురదగా అనిపించొచ్చు. సమస్య ఉన్నచోట చల్లని టీ-బ్యాగుల్ని కాసేపు ఉంచడం వల్ల ఉపశమనంగా అనిపిస్తుంది.

కొందరిలో పాదాలకు ఎక్కువ చెమట పట్టడం వల్ల వాటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటివారు పెద్ద గిన్నెడు నీళ్లలో రెండు కప్పుల గ్రీన్‌టీ డికాక్షన్‌ వేసి బాగా వేడి చేయాలి.

ఆ నీటిని టబ్బులో వేసి పాదాల్ని కాసేపు అందులో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెమట సమస్యతో పాటు పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్