కొత్తది ప్రయత్నించే ముందు..

ఆకర్షించే ప్రకటన లేదా స్నేహితుల నుంచి మంచి రివ్యూ.. అమ్మాయిలను కొత్త సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించేలా ప్రోత్సహిస్తుంటాయి. మరి అవి మీకూ తగినవేనా? సరి ...

Published : 31 Aug 2021 00:48 IST

ఆకర్షించే ప్రకటన లేదా స్నేహితుల నుంచి మంచి రివ్యూ.. అమ్మాయిలను కొత్త సౌందర్య ఉత్పత్తులను ప్రయత్నించేలా ప్రోత్సహిస్తుంటాయి. మరి అవి మీకూ తగినవేనా? సరి చూసుకోవాలి. అదెలాగంటే..

ముందు మీ చర్మ తీరుపై అవగాహన ఏర్పరచుకోవాలి. తర్వాత కొనాలనుకునే ఉత్పత్తిలో వాడిన పదార్థాలేంటో చూసుకోవాలి. క్లెన్సర్‌, స్క్రబ్‌ వంటివి కడిగేస్తే సరిపోతాయి. కానీ సీరమ్‌, మాయిశ్చరైజర్‌ వంటివి చర్మంపై కొద్ది గంటలపాటు.. మళ్లీ ముఖం కడిగేంతవరకూ ఉండిపోతాయి. కాబట్టి వీటి పట్ల మరింత జాగ్రత్త వహించాలి.

ఫర్లేదు అనిపిస్తే ప్యాచ్‌ టెస్ట్‌ చేయాలి. అంటే కొద్ది మొత్తంలో క్రీమ్‌ను చేతికి రాసి, 24 గంటలపాటు అలాగే ఉంచాలి. దురద, ఎర్రదనం, దద్దుర్లు వంటివి లేకపోతే అప్పుడే ఉపయోగించాలి. స్కిన్‌ కేర్‌ రొటీన్‌ను సక్రమంగా అనుసరించడమూ ప్రధానమే. అలాగే సరైన ఫలితం రావాలనుకుంటే ప్రొడక్ట్‌పై ఉపయోగించమన్న తీరునీ పరిగణనలోకి తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్