అందానికి అతిమధురం!

చర్మతత్వం ఎటువంటిదైనా అతి మధురం పొడితో వేసే ప్యాక్‌ ముఖాన్ని మెరుపులీనేలా చేస్తుంది. దీన్ని లికొరైస్‌ పౌడర్‌ అని కూడా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధి నిరోధకశక్తిని పెంచే,

Published : 10 Sep 2021 01:27 IST

చర్మతత్వం ఎటువంటిదైనా అతి మధురం పొడితో వేసే ప్యాక్‌ ముఖాన్ని మెరుపులీనేలా చేస్తుంది. దీన్ని లికొరైస్‌ పౌడర్‌ అని కూడా పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధి నిరోధకశక్తిని పెంచే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఈ పౌడర్‌తో మొటిమలు, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీని వినియోగించడం ఎలానో చూద్దాం...

పచ్చిపాలతో...

చెంచా అతిమధురం పొడిలో కాసిన్ని పచ్చిపాలను కలిపి బాగా మిక్స్‌ చేయాలి. దీన్ని ముఖానికి పూత వేసుకునే ముందు తప్పనిసరిగా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ప్యాక్‌ను పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. మోము తాజాగా మెరుస్తుంది. దీన్ని రోజూ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

నిమ్మరసాన్ని చేర్చి...

చెంచా అతి మధురం పొడిలో మూడు చెంచాల నిమ్మరసం, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు ఆరనివ్వాలి. పొడి చర్మం ఉన్నవారు తడిపొడిగా ఉన్నప్పుడే నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ఫేస్‌మాస్క్‌ క్లెన్సింగ్‌లా పనిచేసి, మురికినీ, మృతకణాలను తొలగిస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇందులోని సుగుణాలు యాక్నే, మొటిమలు వాటి తాలూకు మచ్చల్ని తగ్గిస్తాయి.

ముల్తానీ మట్టితో...

మూడు చెంచాల ముల్తానీ మట్టిలో కొద్దిగా అతి మధురం పొడిని వేసి గులాబీ నీటితో పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంలా రాసి పావుగంట ఆరనివ్వాలి. ఆపై చన్నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్