మోమును మెరిపించే మసాజర్లు..

చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, అక్కడి కణాలను ఉత్తేజితం చేసి మోమును మెరిసేలా చేస్తాయి మసాజర్లు. ఇవి ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

Published : 11 Oct 2021 01:44 IST

చర్మంలో రక్తప్రసరణను మెరుగుపరిచి, అక్కడి కణాలను ఉత్తేజితం చేసి మోమును మెరిసేలా చేస్తాయి మసాజర్లు. ఇవి ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..

బ్యాటరీతో : కొన్నిరకాల మసాజర్లు బ్యాటరీతో పనిచేస్తాయి. వీటితో మసాజ్‌ చేస్తే ముఖం కాంతిమంతంగా మారుతుంది.  వాటికి అనుసంధానంగా ఇంకొన్ని పరికరాలను ఉపయోగించి క్లెన్సింగ్‌, క్లీనింగ్‌ చేయొచ్చు. మృతకణాల్నీ తొలగించొచ్చు.

ఎలక్ట్రిక్‌ పోర్టబుల్‌ మసాజర్‌ : దీంతో క్లెన్సింగ్‌ చాలా సులువు. బ్రష్‌ రూపంలో ఉండే దీంతో మసాజ్‌ చేసుకుంటే, ఇది చర్మ కణజాలం, కండరాలను బిగుతుగా చేసి, మెరుపులీనేలా మారుస్తుంది.   ముఖంపై 360 డిగ్రీల్లో అన్ని దిశల్లోనూ సునాయాసంగా తిరగగలగడం దీని ప్రత్యేకత. ఇందులో అవసరానికి తగ్గట్లు మార్చుకోవడానికి వీలుగా నాలుగు హెడ్స్‌ కూడా ఉంటాయి.

డీప్‌ హీట్‌ మసాజర్‌ : ఇది మోమును మృదువుగా వైబ్రేట్‌ చేస్తుంది. దీన్నుంచి వచ్చే వెచ్చదనంతో అక్కడి కణాలు ఉత్తేజితమవుతాయి. చర్మం బిగుతుగా మారుతుంది. అలాగే రీఛార్జిబుల్‌ ఫేషియల్‌ క్లెన్సర్‌తో చేసే మసాజ్‌ ముఖంపై మేకప్‌ను తొలగిస్తుంది. జిడ్డును పోగొట్టి, చర్మరంధ్రాల్లోని మురికిని దూరం చేస్తుంది. దీనికి జత చేసి ఉండే మృదువైన బ్రష్‌ ముఖానికి స్పా ఫీలింగ్‌ను అందిస్తుంది.

సిలికాన్‌ వైబ్రేటరీ మసాజర్‌: ముఖంపై సున్నితమైన వైబ్రేషన్స్‌ను కలిగించే ఫేషియల్‌ సిలికాన్‌ వైబ్రేటరీ మసాజర్‌, ముఖ కండరాలను శక్తిమంతం చేసి ఉత్తేజితం చేస్తాయి.  జేబులో పట్టేలా ఉండే ఈ మసాజర్‌ను ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. ముఖంలో కొత్త మెరుపును తెచ్చుకోవడానికి అత్యవసరంగా దీన్ని వినియోగించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్