ఎత్తు చూసి కొనండి!

రమ్య ఎత్తు మడమలుండే పాదరక్షలను ఇష్టపడి కొనుక్కుంది. వాటిని వేసుకున్నప్పుడు మాత్రం పాదాల నొప్పులను భరించలేకపోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

Published : 25 Oct 2021 02:09 IST

రమ్య ఎత్తు మడమలుండే పాదరక్షలను ఇష్టపడి కొనుక్కుంది. వాటిని వేసుకున్నప్పుడు మాత్రం పాదాల నొప్పులను భరించలేకపోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. మనసుకు నచ్చిన చెప్పులను ధరించి అందంగా అడుగులేయొచ్చు. అవేంటంటే...

ఎత్తు చెప్పుల్ని కొనే ముందు ఓ సారి వేసుకుని అటూ ఇటూ నడిచి చూడండి. సౌకర్యంగా ఉన్నాయనిపిస్తేనే తీసుకోండి. అలానే ఫుట్‌వేర్‌ని ఎప్పుడూ సాయంత్రం వేళల్లో కొనడం వల్ల పాదానికి సరిగ్గా సరిపోతాయంటారు ఫ్యాషన్‌ నిపుణులు.

పాదం, పరిమాణం ఆకారానికి తగ్గట్లుగా చెప్పుల ఎంపిక ఉండాలి. కొందరి పాదాలు చిన్నగా, మరికొందరివి పెద్దగా ఉంటాయి. అలానే కాలివేళ్లలోనూ తేడాలు కనిపిస్తాయి. సైజు ఒకటే అయినా...కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. పొడవైన పాదం, వేళ్లూ ఉన్నవారు ముందువైపు మూసి ఉన్నట్లుగా అనిపించే బూట్లను ఎంపిక చేయకూడదు. ఇవి ఇరుగ్గా అనిపిస్తాయి. పాదం చిన్నగా ఉండేవారికి క్లోజ్డ్‌ బూట్లు నప్పుతాయి. అందుకే కొనేటప్పుడే ఇవన్నీ గమనించుకోవాలి.

ఎత్తు చెప్పులంటే ఆసక్తి ఉన్నవారు పాయింటెడ్‌, పెన్సిల్‌ హీల్స్‌కన్నా, ప్లాట్‌ఫార్మ్స్‌వంటివాటిని ఎంచుకుంటే మంచిది. నడిచేటప్పుడు సౌకర్యంగా ఉంటుంది. ఇక,  బయటకెళ్లేటప్పుడు ముందుగా పాదాలను మాయిశ్చరైజర్‌తో మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే ఎత్తుమడమలుండే చెప్పులు వేసుకున్నప్పుడు ఆ ఒత్తిడితో వచ్చే అరికాళ్ల మంటలు తగ్గుతాయి. కొత్త చెప్పుల కారణంగా వచ్చే బొబ్బలు రావు.

ఎత్తు మడమలుండే బూట్లు తీసుకోవాలంటే వాటిలోపలి వైపు మెత్తని కుషన్‌లాంటి అమరిక ఉండేలా ఎంపిక చేసుకోవాలి. అలాకాకుండా షూ లోపలి సోల్‌ పలుచగా ఉంటే నడిచేటప్పుడు పాదంపై ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. ఇది తీవ్రమైన పాదాలనొప్పికి దారితీస్తుంది.  అలాగే చెప్పులకు అటాచ్‌గా వెనుకవైపు ఉండే స్ట్రాప్‌ పాదానికి సౌకర్యంగా అనిపించేలా ఉంటే చాలు. చకచకా ముందుకి అడుగులేసేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్