ఆహారంతో ఆరోగ్యం!

ఆకలి తీరడానికి ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ఏం తినాలో, వాటితో ఏం ఫలితాలుంటాయో తెలుసుకుని అవి ఆహారంలో ఉండేలా చూసుకోండి...

Updated : 27 Nov 2021 05:44 IST

ఆకలి తీరడానికి ఏదో ఒకటి తింటే సరిపోదు. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ఏం తినాలో, వాటితో ఏం ఫలితాలుంటాయో తెలుసుకుని అవి ఆహారంలో ఉండేలా చూసుకోండి...

ముకలు దృఢంగా ఉండాలంటే క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, చీజ్‌ వంటివి తప్పక తినాలి. బ్రకోలి, క్యాబేజ్‌ మొదలైన వాటిల్లోనూ క్యాల్షియం ఉంటుంది.

* శారీరక, మానసిక బలానికి, మెదడు పని తీరుకు, వెన్నెముక దారుఢ్యానికి అవసరమైన బి విటమిన్‌ చిక్కుడు, బఠాణి, బీన్స్‌, సన్‌ఫ్లవర్‌ విత్తనాలు, ఆకుకూరలు, పాల ఉత్పత్తులు, దోస, చిక్కుడుల్లో ఉంటుంది.

* కణాలకు ప్రాణవాయువును అందించి, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఐరన్‌ కీలకం. ఆకుకూరలు, బీన్స్‌, చిక్కుడు, పప్పు ధాన్యాలు తినడం వల్ల దానికి కొరత ఉండదు.

* గుమ్మడి గింజలు, బాదం, జీడిపప్పు, బఠాణీల్లో మెగ్నీషియం విస్తారం. ఇది ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. మెదడు, కండరాలు, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.  

* రోగనిరోధక శక్తికి ఇ-విటమిన్‌ చాలా అవసరం. ఇది యాంటీ ఆక్సిడెంట్‌ కూడా. వంట నూనెలు, డ్రై ఫ్రూట్స్‌, బ్రకోలి తదితర ఆకుపచ్చ కూరగాయల్లో ఇ-విటమిన్‌ అధికం.

* శరీరంలో ఒమేగా-3 ఆమ్లాలు తగినంతగా లేకుంటే హృద్రోగాలతోబాటు అనేక సమస్యలు వస్తాయి. కనుక చియా విత్తనాలు, వాల్‌నట్స్‌ తగినంత మోతాదులో తినాలి.

* నీళ్లు విస్తారంగా తాగడం మూత్ర పిండాలకు మంచిది. అనేకసార్లు మూత్రానికి వెళ్లడం వల్ల శరీరంలో ఉన్న మలినాలు వెళ్లిపోతాయి.

* రోజులో కాసేపైనా శరీరానికి ఎండపొడ తగిలేలా చూసుకోవాలి. అప్పుడే డి-విటమిన్‌ లోపం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్