మరకలకూ ఫేస్‌వాష్‌

సౌందర్య ఉత్పత్తులు ముఖ్యంగా ఫేస్‌వాష్‌ వంటివి గడువు ముగిస్తే.. వాడే ధైర్యం చేయలేం. ఇకవి చెత్తబుట్ట పాలవుతుంటాయి. కానీ ఇలాంటి వాటితోనూ ఉపయోగాలున్నాయి తెలుసా?

Updated : 29 Feb 2024 17:10 IST

సౌందర్య ఉత్పత్తులు ముఖ్యంగా ఫేస్‌వాష్‌ వంటివి గడువు ముగిస్తే.. వాడే ధైర్యం చేయలేం. ఇకవి చెత్తబుట్ట పాలవుతుంటాయి. కానీ ఇలాంటి వాటితోనూ ఉపయోగాలున్నాయి తెలుసా?

ఫుట్‌ మ్యాట్‌లు తరచూ మురికిగా మారుతుంటాయి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఫేస్‌వాష్‌ వేసి వాటిని నానబెట్టండి. పావు గంట తర్వాత వాషింగ్‌ మెషిన్‌లో వేయడమో, బ్రష్‌తో రుద్దడమో చేయండి. కొత్తవాటిలా కనిపిస్తాయి.

* మగ్గులో కాసిన్ని నీళ్లు తీసుకుని దాంట్లో కొన్ని చుక్కల ఫేస్‌వాష్‌, షాంపూ కలపాలి. ఆ నీటిలో స్పాంజ్‌ని ముంచి వాహనాలను తుడిస్తే మరకలు తొలగి, మెరుస్తాయి.

* పెద్ద చెంచా చొప్పున ఉప్పు, వంటసోడా, ఫేస్‌వాష్‌లను కలపాలి. ఈ మిశ్రమాన్ని మురికిగా ఉన్న కిచెన్‌, బాత్రూమ్‌ టైల్స్‌ మీద రాసి కాసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత టూత్‌బ్రష్‌తో రుద్దితే మురికి, జిడ్డంతా వదిలి తళతళలాడతాయి.

* దుస్తుల మీద పడిన కాఫీ, టీ, చట్నీ మరకలకూ ఫేస్‌వాష్‌ మంచి పరిష్కారం. చెంచా చొప్పున నిమ్మరసం, వంటసోడా, ఫేస్‌వాష్‌లను కలిపి, మరకలపై రాసి పావుగంట తర్వాత ఉతికితే సరి. మరకలు మాయం.

* వీటన్నింటికీ సరే... గడువు ముగిసినా... ఒంటికీ ఉపయోగించొచ్చు. చెంచా చొప్పున ఫేస్‌ వాష్‌, తేనెకు చెంచా చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని అరికాళ్లకు పట్టించి నాలుగైదు నిమిషాలు మృదువుగా మర్దనా చేసి, చల్లటి నీటితో కడిగేయాలి. ఇది పాదాలపై పేరుకుపోయిన మృతకణాలు, మురికి... రెండింటినీ తొలగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్