Published : 10/01/2022 01:11 IST

కేకులు కావివి...

రంగురంగులుగా.. నోరూరించేలా కనిపిస్తున్న వీటిని కేకులు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇవన్నీ ముఖచర్మంపై మృతకణాలను దూరంచేసే స్క్రబ్స్‌, మురికిని తొలగించే సబ్బులు. సహజసిద్ధమైన పదార్థాలతో తయారవుతున్న ఇవి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిలో కాఫీ, చక్కెర, ఎస్సెన్షియల్‌ నూనెలు వంటివి కలపడంతో చర్మాన్ని క్లెన్సింగ్‌ చేసి మృదువుగా మారుస్తాయి. అలాగే రసాయనాల్లేకుండా.. పైనాపిల్‌, జొజొబా, కొబ్బరినూనె, వెన్న వంటివాటితో తయారవుతూ.. కేకుల్లా కనిపిస్తున్న ఈ సబ్బులు ముఖానికి మాయిశ్చరైజర్‌లా పని చేసి కొత్తకాంతిని తెస్తాయి. చూడటానికి భలే ఉన్నాయి కదూ..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని