‘ఇ’ ఒక్కటి చాలు!

ముఖం, పెదాలు, కేశాలు.. హుఫ్‌.. ఒక్కోదానికి ఒక్కో ఉత్పత్తి వాడుతుంటాం. ఏవైనా సమస్యలొస్తే.. మళ్లీ వాటికి వేరేది అవసరమవుతుంది. ఇన్నెందుకు ఒక్కఇ విటమిన్‌ సరిపోతుందిగా అంటున్నారునిపుణులు.

Published : 25 Feb 2022 00:24 IST

ముఖం, పెదాలు, కేశాలు.. హుఫ్‌.. ఒక్కోదానికి ఒక్కో ఉత్పత్తి వాడుతుంటాం. ఏవైనా సమస్యలొస్తే.. మళ్లీ వాటికి వేరేది అవసరమవుతుంది. ఇన్నెందుకు ఒక్కఇ విటమిన్‌ సరిపోతుందిగా అంటున్నారునిపుణులు.

ఉదయానికి, రాత్రికి.. వేర్వేరు క్రీమ్‌లు.. ఏది ఎంచుకోవాలో తెలియడం లేదా? ఉదయం మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌కి కొన్ని చుక్కల ఇ విటమిన్‌ నూనెను కలపండి. రాత్రి నేరుగా పట్టించేస్తే సరి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో కావాల్సిన తేమ అందుతుంది. ఎండకు కమిలినట్టుగా అయినా, చర్మం నిర్జీవంగా అనిపించినా ఈ నూనెను పట్టిస్తే సరి. దురద లాంటి వాటిని దూరం చేయడమే కాదు.. మెరుపునీ ఇస్తుంది.

చుండ్రు, దానితో వచ్చే దురద, జుట్టు త్వరగా పెరగకపోవడం వీటన్నింటికీ ‘ఇ’తో చెక్‌ పెట్టొచ్చు. మీరు రాసుకునే నూనెకు రెండు క్యాప్సూళ్ల ఇ నూనెను కలిపి రాత్రి లేదా తలస్నానానికి అరగంట ముందు పట్టించినా సరిపోతుంది.

* వాతావరణ మార్పులు, వంటింట్లో పని.. ప్రభావం గోళ్లపైనా పడుతుంది. దీంతో కాంతిని కోల్పోయి, నిర్జీవంగా తయారవుతుంటాయి. కొంచెం ‘ఇ’ నూనెను గోళ్లకు పట్టించి మృదువుగా మర్దన చేసి చూడండి. తిరిగి జీవం సంతరించుకుంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్