శిరోజాల ఆరోగ్యానికి స్క్రబ్బింగ్‌

ఎండవేడి చర్మంపైనే కాదు, మాడుపైనా ప్రభావం చూపిస్తుంది. చర్మం పెళుసుబారి చుండ్రు సమస్య మొదలవుతుంది. దురదతోపాటు జుట్టు రాలే సమస్యకు ఇది దారి తీస్తుంది. దీన్ని నిరోధించాలంటే

Updated : 16 Apr 2022 04:11 IST

ఎండవేడి చర్మంపైనే కాదు, మాడుపైనా ప్రభావం చూపిస్తుంది. చర్మం పెళుసుబారి చుండ్రు సమస్య మొదలవుతుంది. దురదతోపాటు జుట్టు రాలే సమస్యకు ఇది దారి తీస్తుంది. దీన్ని నిరోధించాలంటే మాడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

కాఫీపొడితో.. తల స్నానానికి అరగంట ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మర్దనా చేసుకోవాలి. చెంచా కాఫీపొడికి రెండు చెంచాల ఆలివ్‌నూనె కలిపిన మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటిని తలపై చిలకరించి ముని వేళ్లతో మృదువుగా రుద్దాలి. దీంతో మాడుపై మృత కణాలు దూరమై, చర్మంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. శిరోజాలనూ రాలనివ్వదు.

దాల్చినచెక్కతో.. చెంచా వంట సోడాలో అరచెంచా దాల్చిన చెక్కపొడి, రెండు చెంచాల ఆలివ్‌నూనె వేసి బాగా కలపాలి. జుట్టును చిన్నచిన్న పాయలుగా విడదీసి మాడుకు మాత్రం పట్టేలా ఈ మిశ్రమాన్ని రాయాలి. అరగంట ఆరనిచ్చి, తలస్నానం చేస్తే మృతకణాలు దూరమవుతాయి. మాడు మృదువుగా మారి, చర్మరంధ్రాలు శుభ్రపడి శిరోజాలకు తగిన రక్తప్రసరణ జరుగుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలన్నీ మాయమవుతాయి.

చక్కెరతో.. మూడు చెంచాల చక్కెరకు రెండు చెంచాల కొబ్బరినూనె, రెండు మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ లేదా లావెండర్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మృదువుగా రుద్దాలి. పావుగంట తర్వాత రసాయనాల్లేని షాంపుతో తలస్నానం చేస్తే, మృతకణాలు తొలగి మృదువుగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్