కొనగోటి అందానికి..

మృదువైన చేతులకు గులాబీ వర్ణంలో మెరిసే ఆరోగ్యకరమైన  గోళ్లు మరింత అందాన్ని తెస్తాయి. నఖ సౌందర్యానికి ముందుగా వాటిని ఆరోగ్యంగా ఎలా సంరక్షించుకోవాలో నిపుణులు చెబుతున్నారిలా..గోళ్లకు క్యూటికల్‌...

Published : 11 Jun 2022 01:16 IST

మృదువైన చేతులకు గులాబీ వర్ణంలో మెరిసే ఆరోగ్యకరమైన  గోళ్లు మరింత అందాన్ని తెస్తాయి. నఖ సౌందర్యానికి ముందుగా వాటిని ఆరోగ్యంగా ఎలా సంరక్షించుకోవాలో నిపుణులు చెబుతున్నారిలా..

గోళ్లకు క్యూటికల్‌ ఆయిల్‌ రాస్తే వాటి చుట్టూ ఉండే చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజుకి మూడునాలుగుసార్లు ఈ నూనెతో వేళ్ల చివర్లలో మర్దనా చేస్తే గోళ్లు ఆరోగ్యంగా మెరుస్తుంటాయి.  విరిగిపోకుండానూ ఉంటాయి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌..
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, గోళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో గోళ్లు బలహీనపడవు. అలాగే బీ విటమిన్‌ గోళ్లను బలంగా, దళసరిగా పెరిగేలా చేస్తే, ప్రొటీన్లు విరగకుండా కాపాడతాయి. నెయిల్‌పాలిష్‌ ఎంపికలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. అలాగే ముందుగా బేస్‌ వేసి, ఆరిన తర్వాతే నెయిల్‌పాలిష్‌ వేయడం అలవరుచుకోవాలి. ఇలా చేస్తే వాటిలోని రసాయనాల ప్రభావం గోళ్లపై పడకుండా ఉంటుంది. నెయిల్‌పాలిష్‌ రిమూవర్‌ ఎసిటోన్‌ ఫ్రీవి వినియోగిస్తే మంచిది. లేదంటే గోళ్లు  బలహీనపడతాయి.

నకిలీ వద్దు..
గోళ్ల ఎక్స్‌టెన్షన్‌ కోసం జెల్‌, అక్రిలిక్‌ నెయిల్స్‌ను అతికించడం, నాణ్యతలోపించిన నెయిల్‌పాలిష్‌తోపాటు కొత్తరకాల హంగుల కోసం గోళ్లపై ఒత్తిడి తేవడం వంటివన్నీ నఖసౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. అదనపు గోరును అటాచ్‌ చేయడం కోసం అల్ట్రావయొలెట్‌ కిరణాలను వినియోగించడం వల్ల వాటి ప్రభావం గోళ్లపై పడి, వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. వీలైనంత సహజంగా పెరిగేలా గోళ్లను పరిరక్షించుకోవడం మంచిది.

అతిగా..
శానిటైజర్స్‌ను ఎక్కువగా వినియోగించడంవల్ల కూడా వీటిలోని ఆల్కహాల్‌ గోళ్లను బలహీనపరుస్తాయి. గిన్నెలు శుభ్రం చేసేటప్పుడు లేదా దుస్తులు ఉతికేటప్పుడు చేతికి గ్లవుజులు ధరిస్తే సబ్బుల్లోని రసాయనాల ప్రభావం గోళ్లపై పడకుండా ఉంటుంది. తరచూ ట్రిమ్‌ చేసుకోవడం, రోజూ కొబ్బరినూనెతో మృదువుగా చేసే మర్దన మాయిశ్చరైజర్‌గా పనిచేసి గోళ్ల చుట్టూ ఉన్న చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రెండు రోజులకొకసారి నిమ్మచెక్కతో గోళ్ల చుట్టూ చేసే మర్దనా ఎటువంటి ఇన్ఫెక్షన్లబారిన పడకుండా కాపాడుతుంది. అలాగే గోళ్లు కొరికే అలవాటుకు దూరంగా ఉండాలి. లేదంటే వీటివల్ల ఇన్ఫెక్షన్లబారిన పడటమేకాదు, నఖసౌందర్యం పూర్తిగా దెబ్బతింటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్