పొట్ట తగ్గాలంటే..

కొందరు మహిళలకి పిల్లలు పుట్టాక పొట్ట రావడం చూస్తుంటాం. అదెంతో భారంగా ఉంటుంది. దీని వల్ల అందం తగ్గుతోందని బాధ ఒకపక్క.. చూసేవాళ్లు ఏమనుకుంటారో అనిపించే న్యూనత మరో పక్క. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయిందా? అయితే దండ యోగా చేసి చూడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది.

Published : 10 Sep 2022 00:31 IST

కొందరు మహిళలకి పిల్లలు పుట్టాక పొట్ట రావడం చూస్తుంటాం. అదెంతో భారంగా ఉంటుంది. దీని వల్ల అందం తగ్గుతోందని బాధ ఒకపక్క.. చూసేవాళ్లు ఏమనుకుంటారో అనిపించే న్యూనత మరో పక్క. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయిందా? అయితే దండ యోగా చేసి చూడండి, తప్పకుండా ఫలితం ఉంటుంది. గతంలో మోకాళ్ల నొప్పులకు సంబంధించిన దండయోగా చూశారు కదా! ఇప్పుడు ఇంకొంచెం భిన్నంగా పొట్ట, పిరుదుల దగ్గరున్న కొవ్వు తగ్గడానికి ఈ సాధన చేయండి!

కింద కూర్చుని మోకాళ్ల కింది భాగంలో కర్రను ఉంచి చేతులతో పట్టుకోవాలి. కాళ్లను కాస్త పైకి లేపాలి. మొదట మోకాళ్ల జాయింట్ల దగ్గర కాస్త దగ్గరగా మడిచి కాళ్లను కొంచెం ముందుకు జాపాలి. ఆనక కర్రను ఊతంగా పట్టుకుని మోకాళ్లను వెనక్కి తీసుకురావాలి. ఇందులో పాదాలను కింద పెట్టకూడదు. శరీర బరువంతా పిరుదుల మీదే ఉంచాలి. కర్ర సాయంతో మోకాళ్లను మెల్లగా ముందుకి, వెనక్కి జరుపుతుండాలి. ఇది కొంచెం నౌకాసనాన్ని తలపిస్తుంది. కర్ర వాడటం వల్ల ఎక్కువసార్లు చేయగలుగుతాం. పిరుదుల మీద బరువు మోపుతూ సాధన చేస్తాం కనుక పొట్ట, పిరుదుల వద్ద పేరుకున్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఈ యోగసాధనతో పదిహేను రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్