చెవి రింగులూ... ముఖ్యమే మరి!

అందంగా కనిపించడానికి దుస్తుల ఎంపిక ఒక్కటే సరిపోదు. వాటి మీదకు నప్పే చెవిపోగులూ ముఖ్యమే అంటారు స్టైలిస్టులు. అప్పుడే తళుకులీనొచ్చని చెబుతారు.

Published : 08 Dec 2022 00:15 IST

అందంగా కనిపించడానికి దుస్తుల ఎంపిక ఒక్కటే సరిపోదు. వాటి మీదకు నప్పే చెవిపోగులూ ముఖ్యమే అంటారు స్టైలిస్టులు. అప్పుడే తళుకులీనొచ్చని చెబుతారు. మరి చెవులకు  ఎలాంటి నగలు ఎంచుకోవాలో చెబుతున్నారిలా...

* చెవి పోగులు ఎన్నున్నా ఇయర్‌ కఫ్‌ల ప్రత్యేకతే వేరు... వీటిలో అటు సంప్రదాయ, ఇటు ఆధునిక ఆహార్యాల మీదకు అమరిపోయే డిజైన్లెన్నో ఉన్నాయి. కాస్త చిన్న చెవులు ఉన్న వారు వీటిని పెట్టుకుంటే నిండుగా కనిపించేలా చేస్తాయి.

* ఒకప్పుడు అమ్మ, అమ్మమ్మలు మాత్రమే పెట్టుకునే దిద్దులను ఇప్పుడు అమ్మాయిలూ ఇష్ట పడుతున్నారు. సింపుల్‌గా, స్టైలిష్‌ లుక్‌తో ఉండే రకాలని ఎంచుకుని హుందాగా కనిపిస్తున్నారు. ఆఫీసులకు ఇవి బాగా నప్పుతాయి. ముఖ్యంగా ముత్యం, స్టోన్‌ వంటివి పొదిగిన దిద్దులు... కఫ్తాన్‌లూ, కాలర్‌ లేని టాప్‌లూ, ట్యాంక్‌టీలకు జతగా మెప్పిస్తాయి. అదే సంప్రదాయ రకాల మీదకైతే స్టేట్‌మెంట్‌ స్టోన్‌ స్టడ్స్‌ అదిరిపోతాయి.

* మోనోక్రొమాటిక్‌ (ఏకరంగు) దుస్తుల మీదకు స్టోన్‌ హూప్స్‌, షోల్డర్‌డస్టర్‌ ఇయర్‌ రింగ్స్‌ బాగుంటాయి. అచ్చంగా స్టడ్స్‌ని ఎంచుకోవాల్సి వస్తే కాస్త పెద్ద పరిమాణంలో ఉండేవి తీసుకోండి. ఇవి కాక్‌టెయిల్‌ పార్టీల వేళ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. సంప్రదాయ దుస్తుల మీదకు చిన్న రింగులు, దిద్దులు, జుంకాలు బాగుంటాయి. రాత్రిపూట జరిగే వేడుకలకు క్రిస్టల్స్‌, రాళ్లతో చేసినవి పెట్టుకుంటే ఆ అందమే వేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్