పాలపొడితో పసిమి ఛాయ..

లాక్టిక్‌ యాసిడ్‌ ఉండే పాలపొడి చర్మానికి మృదుత్వాన్ని అందించి కాంతిమంతంగా చేస్తుంది. ఇది క్లెన్సర్‌గా మారి ముఖంపై నల్ల మచ్చలను దూరం చేసి పసిడి మెరుపులనందిస్తుంది.

Updated : 12 Jan 2023 14:13 IST

లాక్టిక్‌ యాసిడ్‌ ఉండే పాలపొడి చర్మానికి మృదుత్వాన్ని అందించి కాంతిమంతంగా చేస్తుంది. ఇది క్లెన్సర్‌గా మారి ముఖంపై నల్ల మచ్చలను దూరం చేసి పసిడి మెరుపులనందిస్తుంది.

చెంచా చొప్పున పాలపొడి, శనగపిండి, నారింజ రసాన్ని కలిపిన మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసి పావుగంట ఆరనివ్వాలి. చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. ఎండవల్ల కమిలిన చర్మం పూర్వపు స్థితికి వస్తుంది. రెండు చెంచాల పెరుగు, చెంచా పాలపొడి, అరచెంచా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడగాలి.  పిగ్మెంటేషన్‌ మచ్చలు దూరమై చర్మం తాజాగా మారుతుంది.

మొటిమలు మటుమాయం..

చెంచా చొప్పున పసుపు, తేనె, రెండు చెంచాల పాలపొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు.. మొటిమలు దూరమవుతాయి. చెంచా ముల్తానీ మట్టి, చెంచాన్నర పాల పొడి, తగినంత గులాబీ నీటిని కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగితే జిడ్డు దూరమై, మెరుపులీనుతుంది.

పొడిబారకుండా..

టొమాటోను మెత్తగా చేసి పావుచెంచా పసుపు, చెంచా చొప్పున పెరుగు, పాలపొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగితే చాలు. పొడిబారి నిర్జీవంగా కనిపించే ముఖచర్మం కాంతులీనుతూ.. మృదువుగా మారుతుంది.

ప్రయోజనాలెన్నో..

ఈ పొడిలోని బీటా హైడ్రాక్సీ యాసిడ్‌ ఎక్స్‌ఫోలియేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి చర్మాన్ని సంరక్షిస్తుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి త్వరగా వృద్ధాప్యఛాయలను దరికి చేరనివ్వదు. ఇందులోని డి విటమిన్‌ చర్మానికి మృదుత్వాన్ని, కాంతినిస్తుంది. పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. క్లెన్సింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి చర్మంలోని మృతకణాలను దూరం చేసి ముఖానికి మెరుపునందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్