లిప్‌ బామ్‌ చేసేద్దామా!

అందాన్ని కాపాడుకునే తాపత్రయంతో ఈ మధ్య  సౌందర్య ఉత్పత్తులను తెగ వాడేస్తున్నారు. అయితే, వీటిల్లోని హానికారక రసాయనాలు దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. వీటికి బదులు సహజ సౌందర్య ఉత్పతులు వాడాలనుకుంటే... సులువుగా తయారు చేసుకోగలిగిన వాటిల్లో లిప్‌బామ్‌ ఒకటి.

Published : 01 Apr 2023 00:20 IST

అందాన్ని కాపాడుకునే తాపత్రయంతో ఈ మధ్య  సౌందర్య ఉత్పత్తులను తెగ వాడేస్తున్నారు. అయితే, వీటిల్లోని హానికారక రసాయనాలు దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. వీటికి బదులు సహజ సౌందర్య ఉత్పతులు వాడాలనుకుంటే... సులువుగా తయారు చేసుకోగలిగిన వాటిల్లో లిప్‌బామ్‌ ఒకటి. దీని తయారీకి టేబుల్‌ స్పూన్‌ చొప్పున షియా బటర్‌, బీస్‌ వ్యాక్స్‌లను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె చేర్చి డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో వేడి చేయాలి. కరిగేవరకూ ఈ మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత దాన్ని కిందకి దింపి మూత ఉన్న చిన్న గాజు డబ్బాలో పోయాలి. చివరగా ఈ ద్రవానికి రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కూడా చేర్చి...చల్లారనిస్తే సరి. నేచురల్‌ లిప్‌బామ్‌ తయారైపోతుంది. అందాన్నీ, ఆరోగ్యాన్నీ కూడా పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్