సహజమైన సబ్బులు..
నేటి తరం మహిళలు సహజ సౌందర్య ఉత్పత్తుల వినియోగానికే ఓటేస్తున్నారు. అలాంటివే ఈ సబ్బులు, స్క్రబ్బర్లు... ఆ ప్రయోజనాలు తెలుసుకుందామా! బీరపీచు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను సులువుగా తొలగిస్తుంది. దీనికి కొన్ని రకాల పండ్లు, ఎసెన్షియల్ నూనెలు కలిపి సబ్బులు తయారు చేస్తున్నారు.
నేటి తరం మహిళలు సహజ సౌందర్య ఉత్పత్తుల వినియోగానికే ఓటేస్తున్నారు. అలాంటివే ఈ సబ్బులు, స్క్రబ్బర్లు... ఆ ప్రయోజనాలు తెలుసుకుందామా!
బీరపీచు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను సులువుగా తొలగిస్తుంది. దీనికి కొన్ని రకాల పండ్లు, ఎసెన్షియల్ నూనెలు కలిపి సబ్బులు తయారు చేస్తున్నారు. వీటిని వాడితే చర్మాన్ని తేమగానూ, తాజాగానూ ఉంచుతుంది.
కీరదోస పీచు.. ఈ స్క్రబ్బర్లు శరీరంపై పేరుకున్న దుమ్ము, ధూళిని శుభ్రపరచడమే కాదు...దద్దుర్లు, దురద వంటి ఇబ్బందులు తలెత్తకుండా సంరక్షిస్తాయి. వీటికి సహజంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలూ...వాటి కారణంగా వచ్చిన వాపుల్ని తగ్గిస్తాయి. మచ్చలూ తొలగి ముఖం కాంతులీనుతుంది.
వాడటమెలా? సహజంగా చేసిన ఈ సబ్బులను రోజూ ఉపయోగించొచ్చు. అయితే, కూరగాయలతో చేసిన స్క్రబ్బర్లు వాడే ముందు కచ్చితంగా ఐదు నిమిషాలు వేడినీళ్లలో నానబెట్టి శుభ్రం చేయాలి. వాడిన తర్వాత శుభ్రం చేసి కాస్తైనా ఎండ తగిలేలా హ్యాంగర్‌కి తగిలించాలి. అలాగే సబ్బుల్ని, స్క్రబ్బర్లని ఇతరులతో కలిపి వాడకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.