జుట్టు బలానికి గుడ్డు

జుట్టుకి బలం చేకూరుస్తూ, మెరిపించే సుగుణాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

Updated : 08 Aug 2021 05:28 IST

జుట్టుకి బలం చేకూరుస్తూ, మెరిపించే సుగుణాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. మరి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా?

మూడు గుడ్లను పచ్చసొనతో సహా తీసుకుని నిమ్మరసం వేసి గిలకొట్టండి. దీన్ని తలకు రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక కడిగేస్తే సరి. ఇది జుట్టుని బలంగా మారుస్తుంది. చుండ్రునూ తగ్గిస్తుంది.

* ఓ గుడ్డు కొట్టి దాంట్లో టేబుల్‌ స్పూన్‌ ఆవనూనె, రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి రాసి, గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే... జుట్టు రాలడం తగ్గుతుంది. మృదువుగా, నిగారింపుతో కనిపిస్తుంది.

* పచ్చసొనలో కొంచెం కొబ్బరినూనె, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మర్దనా చేయండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా చేస్తే జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది. అలాగే జుట్టు చిట్లిపోయే సమస్య దూరమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్