పిల్లల్లో పెరిగిన ఊబకాయం

కొవిడ్‌ నేపథ్యంలో పిల్లలు బాగా బరువు పెరిగినట్టు ఓ సర్వేలో తేలింది. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన ఈ సర్వే మేరకు 5-11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఎక్కువగా

Published : 15 Sep 2021 01:45 IST

కొవిడ్‌ నేపథ్యంలో పిల్లలు బాగా బరువు పెరిగినట్టు ఓ సర్వేలో తేలింది. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురించిన ఈ సర్వే మేరకు 5-11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఎక్కువగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై చేసిన ఈ అధ్యయనంలో దాదాపు రెండు లక్షల మంది ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను పరిశీలించగా, 2020-21లో అధికశాతం మంది పిల్లలు ఊబకాయానికి గురైనట్లు తెలిసింది. కొవిడ్‌ నేపథ్యానికి ముందు, ఆ తర్వాత పోలిస్తే అయిదు నుంచి పదకొండేళ్ల లోపు చిన్నారులు సగటున 2.25 కేజీల బరువు పెరిగారు. అలాగే 12-17 ఏళ్ల మధ్య పిల్లల బరువు రెండు కేజీలు అధికమైనట్లు తేలింది. ఈ సమస్య 12ఏళ్లపైబడిన వారికన్నా, 11 ఏళ్లలోపు చిన్నారుల్లోనే ఎక్కువగా కనిపించింది. దీనికి పరిష్కారంగా పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు అలవరిచి, వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే చిన్నప్పటి నుంచే ఊబకాయం సమస్యకు గురై పలు రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్