తాడుతో చేసే కసరత్తులు

ఆరోగ్యానికీ, అందానికీ వ్యాయామం అవసరం. కానీ కొవిడ్‌ పరిస్థితులు, ఇతరత్రా బాధ్యతలతో జిమ్‌కి వెళ్లే తీరిక ఉండదు చాలా మందికి. అలాంటి వారు రెసిస్టెన్స్‌ బ్యాండ్‌తో ఈ కసరత్తులు ప్రయత్నించండి. ఈ బ్యాండ్‌ని స్తంభానికో, కిటికీ గ్రిల్‌కో వేసి రెండు చేతులతో బలంగా పట్టుకుని గుంజిళ్లు తీయవచ్చు.  ఇలా చేస్తే చేతి కండరాలు దృఢంగా మారతాయి. నడుము, పిరుదుల దగ్గర ఉన్న కొవ్వు...

Published : 28 Sep 2021 01:22 IST

ఆరోగ్యానికీ, అందానికీ వ్యాయామం అవసరం. కానీ కొవిడ్‌ పరిస్థితులు, ఇతరత్రా బాధ్యతలతో జిమ్‌కి వెళ్లే తీరిక ఉండదు చాలా మందికి. అలాంటి వారు రెసిస్టెన్స్‌ బ్యాండ్‌తో ఈ కసరత్తులు ప్రయత్నించండి.

స్క్వాట్స్‌: ఈ బ్యాండ్‌ని స్తంభానికో, కిటికీ గ్రిల్‌కో వేసి రెండు చేతులతో బలంగా పట్టుకుని గుంజిళ్లు తీయవచ్చు.  ఇలా చేస్తే చేతి కండరాలు దృఢంగా మారతాయి. నడుము, పిరుదుల దగ్గర ఉన్న కొవ్వు సులువుగా కరుగుతుంది.

పుషప్స్‌: ఈ సాధన కోసం రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ని వీపు వెనక నుంచి ముందుకు తీసుకోండి. బలంగా చేతులతో కింద నొక్కిపెట్టి పైకి, కిందకి లేస్తూ బస్కీలు తీయండి. మొదటిసారి వ్యాయామం చేసేవారు, కాస్త లావుగా ఉండే వారు దీన్ని ఎంచుకుంటే సౌకర్యం. దీనివల్ల చేతుల కండరాలు బలపడతాయి.

క్రంచెస్‌:  బ్యాండ్‌ని పాదాలకు వేసి వీలైనంతగా సాగదీయడం, రెండు కాళ్లనూ గుండ్రంగా తిప్పుతూ సైక్లింగ్‌ చేయండి. ఇలా చేస్తే కాలి కండరాలు దృఢపడతాయి. పొట్టా, గర్భాశయం ఆరోగ్యంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్