గుండెకు గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ లతో పాటు ఐరన్, క్యాల్షియం, ఫ్యాటీయాసిడ్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ, ఈ లతో పాటు ఐరన్, క్యాల్షియం, ఫ్యాటీయాసిడ్లు, అమైనో యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..
బరువు తగ్గడం.. వీటిలో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సాయపడుతుంది. స్థూలకాయంతో బాధ పడేవారు రోజూ కాసిని గుమ్మడి గింజలను తింటే పొట్ట నిండుగా ఉంటుంది. అతిగా ఆహారం తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ గింజల్లోని జింక్ రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.
క్యాన్సర్ నివారణకు.. గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణనిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ప్రొస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే కొన్ని గుమ్మడి గింజలను రోజువారీ ఆహారంగా తీసుకోవాలి.
గుండెకు మంచిది.. వీటిలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది.హైపర్ టెన్షన్ తగ్గించడమే కాకుండా ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఇవి రక్తంలోని పీహెచ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
శిరోజాల పెరుగుదలకు.. వీటిలో ఉండే సెలెనియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, విటమిన్ ఏ, బీ లు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు అంది కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రు సమస్య కూడా నియంత్రణలో ఉంటుంది.
షుగర్ నియంత్రణకు.. గుమ్మడిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. మధుమేహంతో బాధ పడే వారు రోజూ ఆహారంలో తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రణలో ఉంచవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.