గర్భం దాల్చాక మధుమేహమా!

ప్రస్తుతం కాలంలో గర్భిణులు ఎదుర్కొనే ప్రధాన సమస్య డయాబెటిస్‌. దీన్నే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అని కూడా అంటారు. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించి ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Updated : 09 Aug 2023 16:55 IST

ప్రస్తుతం కాలంలో గర్భిణులు ఎదుర్కొనే ప్రధాన సమస్య డయాబెటిస్‌. దీన్నే జెస్టేషనల్‌ డయాబెటిస్‌ అని కూడా అంటారు. ఈ పరిస్థితి ఎదురైనప్పుడు కొన్ని ఆహార నియమాలు పాటించి ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

  • పీచు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయల్లో ఫైబర్‌  పుష్కలంగా దొరుకుతుంది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. తగినంత శక్తినీ అందిస్తాయి.
  • రోజువారీ డైట్‌లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలోని చక్కెర నిల్వల్ని నియంత్రణలో ఉంచడానికీ, కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. చేపలు, చికెన్‌, వంటి వాటిలో ప్రొటీన్‌ ఎక్కువ. వీటితో కొంతమేర ఈ సమస్యను అధిగమించొచ్చు.
  • డ్రైఫ్రూట్స్‌, నట్స్‌, ఆలివ్‌ నూనె లాంటి ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులను మాత్రమే తీసుకోవాలి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. గుండె సమస్యల ముప్పునూ తగ్గిస్తాయి.
  • తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి. పెరుగు, చీజ్‌లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. తల్లి ఎముకలతో పాటు కడుపులోని బిడ్డ ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయుల్ని నియంత్రణలో ఉంచుతాయి.
  • క్యాలీఫ్లవర్‌, బచ్చలికూర, బ్రకలీ, క్యాప్సికంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, విటమిన్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ కూరలు రక్తంలోని చక్కెర స్థాయులను పెరగనివ్వవు.
  • నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, పేస్ట్రీలు, వైట్‌బ్రెడ్‌, ఉప్పు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు, జంక్‌ఫుడ్‌, కొవ్వుతో ఉన్న పాల ఉత్పత్తులు తినకూడదు. ఇవి రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్