మాగిన అరటి.. మంచిదే!

అరటిపండ్లంటే ఇష్టమున్నా... వాటికి కొద్దిగా మచ్చ వచ్చినా, మిగల పండినా తినకుండా పక్కన పెట్టేస్తాం. కానీ వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా!

Published : 11 Aug 2023 00:08 IST

అరటిపండ్లంటే ఇష్టమున్నా... వాటికి కొద్దిగా మచ్చ వచ్చినా, మిగల పండినా తినకుండా పక్కన పెట్టేస్తాం. కానీ వీటిలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో తెలుసుకుందామా!

  • కండరాల నొప్పులను తగ్గించడంలో మాగిన అరటిపండు చాలా సహాయపడుతుంది. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • బాగాపండిన అరటిపండుని తినడం వల్ల గ్యాస్ట్రిక్‌, ఛాతిలో మంట తగ్గుతాయి. దీనిలోని  యాంటాసిడ్‌లు పేగు పొరకు హాని కలిగించే యాసిడ్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
  • అరటిపండులోని పోషకాలు ఒంటికి తగినంత, తక్షణ శక్తిని అందించి ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి.
  • ఎక్కువగా పండిన అరటిపండ్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలోని  పొటాషియం, మెగ్నీషియం రక్తంలోని చెడు కొవ్వులను తగ్గించి రక్తప్రసరణను మెరుగు పరిచి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
  • వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి నిండైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని