వారమంతా.. వ్యాయామం!

ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌ అంటూ బిజీగా ఉండే ఉద్యోగినులకు ఫిట్‌నెస్‌పై ధ్యాస ఉంచడానికి సమయం ఉండదు. కానీ ఇలా వారానికి సరిపడేలా ఒక ప్లాన్‌ వేసుకోండి. తేలిగ్గా వ్యాయామ లక్ష్యాలని పూర్తిచేసేయొచ్చు...

Updated : 21 Nov 2023 03:28 IST

ఇల్లు, పిల్లలు, ఆఫీస్‌ అంటూ బిజీగా ఉండే ఉద్యోగినులకు ఫిట్‌నెస్‌పై ధ్యాస ఉంచడానికి సమయం ఉండదు. కానీ ఇలా వారానికి సరిపడేలా ఒక ప్లాన్‌ వేసుకోండి. తేలిగ్గా వ్యాయామ లక్ష్యాలని పూర్తిచేసేయొచ్చు...

మొదటిరోజు: వర్కవుట్స్‌ చేసేటప్పుడు మొదట గుండెకు సంబంధించిన వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. జంపింగ్‌ జాక్స్‌, డ్యాన్స్‌ వంటివి చేస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. అలాగే ఆక్సిజన్‌ సరఫరా మెరుగుపడుతుంది. ఫలితంగా కణాలు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసి కెలొరీలను కరిగిస్తాయి. శక్తిస్థాయులూ.. పెరుగుతాయి. 20 నిమిషాలపాటూ ఇంట్లో పిల్లలనూ కలుపుకొంటే అందరికీ ఉత్సాహం, ఆరోగ్యం సొంతమవుతుంది.

రెండో రోజు: కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. మెట్లు ఎక్కడం, బరువులెత్తడం వల్ల కొవ్వు కరిగి ఆరోగ్యకరమైన కణజాలం ఉత్పత్తి అవుతుంది. ఒక్క పావుగంట ఈ వ్యాయామాలు చేసినా బరువు తగ్గి, కండరాల సామర్థ్యం పెరుగుతుంది.

మూడో రోజు: విశ్రాంతి తీసుకోండి. కఠినమైన వ్యాయామాలు వద్దు. కానీ చిన్నచిన్న స్ట్రెచింగ్‌లు చేయండి. దీనివల్ల తర్వాతి రోజు వ్యాయామానికి శరీరం సిద్ధమవుతుంది. 

నాలుగోరోజు: చేతులు, భుజాల వద్ద కండరాలు బలోపేతమయ్యే వర్కవుట్లు చేయాలి. పుష్‌అప్స్‌ వంటివి పావుగంట చేస్తే చాలు.

అయిదోరోజు: ఉదయం 20 నిమిషాలపాటూ బ్రిస్క్‌ వాక్‌ లేదా జాగింగ్‌ చేస్తే గుండెకు రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. కాలి కండరాలు బలోపేతమవుతాయి. కీళ్లనొప్పులు దరిచేరవు.

ఆరో రోజు: లోయర్‌బాడీ వర్కవుట్‌కు పావుగంట కేటాయించాలి. స్క్వాట్స్‌ వంటివి చేస్తే కాళ్లలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. కండరాలు శక్తివంతమవుతాయి.

ఏడో రోజు: చివరి రోజున 20 నిమిషాలపాటూ యోగా, ధ్యానం చేస్తే శరీరం, మనసు రిలాక్స్‌ అవుతాయి. ఒత్తిడి దూరమై.. వ్యక్తి, వృత్తిగత జీవితాన్ని సమన్వయం చేసే శక్తి అందుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్