ప్రేమగా... ఆరోగ్యమివ్వండి

వద్దన్నా జంక్‌ ఫుడ్‌ తింటుంది. ఎంత చెప్పినా తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు... ప్రేయసి, స్నేహితురాలు లేదా ప్రియమైన భార్య గురించి ఇలాంటి ఫిర్యాదులు చెప్పే మగవారెక్కువే.

Updated : 16 Mar 2024 15:19 IST

ఆమెకో కానుక

వద్దన్నా జంక్‌ ఫుడ్‌ తింటుంది. ఎంత చెప్పినా తన ఆరోగ్యం గురించి పట్టించుకోదు... ప్రేయసి, స్నేహితురాలు లేదా ప్రియమైన భార్య గురించి ఇలాంటి ఫిర్యాదులు చెప్పే మగవారెక్కువే. పనుల ఒత్తిడి, సమయం లేదని టీతోనో, వంటింట్లో కనిపించిన చిరుతిళ్లతోనో కడుపు నింపేసుకునే ఆడాళ్లే ఎక్కువ మరి. ఉద్యోగినులూ ఇందుకు మినహాయింపు కాదు. పని పూర్తిచేసుకోవాలని బిస్కట్లు, స్నాక్స్‌తో మమ అనిపించేస్తుంటారు. వారి ఆరోగ్యం ఏమవుతుందా అని బెంగా? అయితే ఈ హ్యాంపర్లను ‘మహిళా దినోత్సవ’ కానుకగా ఇవ్వండి. తరవాత కొనసాగించేలా ప్రోత్సహించండి. నూనె లేని, మిల్లెట్స్‌తో చేసిన, మహిళల ఆరోగ్యానికి మేలు చేసే విత్తనాలు... ఇలా బోలెడు రకాల్లో దొరుకుతున్నాయి. ఆరోగ్యకరమైన స్వీట్లకూ వీటిల్లో చోటుంది. మీ మనసైనవారు మెచ్చినవేంటో వెతకడమే మీ పని. ప్రయత్నిస్తారా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్