రక్తహీనత తగ్గించే బీట్‌రూట్‌!

శరీరానికి కీలక పోషకాలు, ఖనిజాలు... అందించడంలో బీట్‌రూట్‌ మేటి. కానీ, దీన్ని తినడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు.

Published : 18 Mar 2024 01:48 IST

శరీరానికి కీలక పోషకాలు, ఖనిజాలు... అందించడంలో బీట్‌రూట్‌ మేటి. కానీ, దీన్ని తినడానికి మాత్రం చాలామంది ఇష్టపడరు.

హిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య రక్తహీనత. ఈ ముప్పుని తగ్గించుకోవాలంటే ఐరన్‌ పోషకం ఒంట్లో పుష్కలంగా ఉండాలి. అది బీట్‌ రూట్‌ నుంచి తగినంతగా అందుతుంది. దీన్ని కూర, జ్యూస్‌, సలాడ్‌...ఇలా ఏ రూపంలో తీసుకున్నా హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది.

  • విటమిన్‌ బి, సిలు బీట్‌రూట్‌లో మెండుగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటుని అదుపు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వ్యాధినిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
  • ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పెద్ద పేగులో ఏర్పడిన బ్లాకేజ్‌లను తొలగిస్తాయి. బి విటమిన్లు పోషకలేమి సమస్యను అదుపు చేసి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి.
  •  బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌ నిల్వలు నైట్రేట్‌ ఆక్సైడ్‌గా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో గడ్డకట్టే సమస్య అదుపులో ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్