ఉదయాన్నే ఏం చేస్తారు?

ఏం చేస్తాం? అందరిలానే బ్రష్‌, వంట... అంటూ జాబితా తీయొద్దు. మీకోసం మీరేం చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే రోజంతా బాగుండాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటున్నారు నిపుణులు.

Published : 20 Mar 2024 01:30 IST

ఏం చేస్తాం? అందరిలానే బ్రష్‌, వంట... అంటూ జాబితా తీయొద్దు. మీకోసం మీరేం చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే రోజంతా బాగుండాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అంటున్నారు నిపుణులు.

  • ఉదయం లేవగానే చకచకా పనుల్లో పడతారా? కొద్దిసేపటికే అలసట కమ్మేస్తుంది కదూ! అలాకాకుండా లేవగానే మీకోసమంటూ ఓ మంచి టీనో, కాఫీనో పెట్టుకొని నింపాదిగా తాగండి. ఆ తరవాతే పనుల్లోకి దిగండి. మళ్లీ సాయంత్రమే టీ లేదా కాఫీ. అప్పటివరకూ ఆకలేసినా, ఊసుపోకపోయినా దాని జోలికి వెళ్లొద్దు. వీలుంటే పండ్ల ముక్కలను కోసిగానీ, జ్యూస్‌గా గానీ చేసి పెట్టుకోండి. ఇవి తింటే ఆకలీ తీరుతుంది. శరీరానికి కావాల్సిన శక్తీ అందుతుంది.
  • ఉదయం నిద్ర లేవగానే చేశామా సరే! ఏమాత్రం సమయం దాటినా వ్యాయామం చేయడానికి శరీరం మొరాయిస్తుంది కదూ! అలాంటప్పుడు ప్రాణాయామం, ధ్యానం వంటివైనా చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఉదయం 9గంటల లోపు నీరెండలో కనీసం పది నిమిషాలైనా నడవండి. ఇది శరీరానికి కావాల్సిన డి విటమిన్‌ అందించి, శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అంతేకాదు ‘డొపమైన్‌’ హార్మోను విడుదలకూ సాయపడుతుంది. అలా రోజంతా ఆనందంగా ఉండొచ్చు.
  • కాలక్షేపం అనగానే చేయి ఫోన్‌వైపే మళ్లుతుంది కదా? సోషల్‌ మీడియాలో అలా కాసేపు పోస్టులు చూద్దామనో, ఒక్క రీల్‌ అనో మొదలుపెడతామా... సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు. ఇక్కడ సమయం వృథానే కాదు... అది మనసుపై తెలియకుండానే చెడు ప్రభావం పడేలా చేయగలదు. కాబట్టి, నిద్రలేచాక కనీసం 3 గంటలు వాటి జోలికి పోవద్దు. పెద్దగా కష్టంలేని పనులే కదూ... కానీ మనసునీ, శరీరాన్నీ ఉల్లాసంగా మార్చేస్తాయి. కావాలంటే ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్