ప్రొటీన్‌ ఎక్కువ వద్దు..

ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రొటీన్‌ ముఖ్యమైనది. దీంతో కండరాలు, ఎముకల పనితీరు మెరుగుపడుతుంది. కానీ ప్రొటీన్‌ మోతాదుకి మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా?

Published : 26 Mar 2024 02:06 IST

ఆరోగ్యకరమైన ఆహారంలో ప్రొటీన్‌ ముఖ్యమైనది. దీంతో కండరాలు, ఎముకల పనితీరు మెరుగుపడుతుంది. కానీ ప్రొటీన్‌ మోతాదుకి మించి తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా?

  • రోజువారీ ఆహారంలో ప్రొటీన్‌ శాతం అధికమైతే అది గ్లూకోజుగా మారుతుంది. తరవాత అది శరీరంలో కొవ్వుగా పేరుకుంటుంది. ఇది ఒక్కోసారి బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎక్కువ ప్రొటీన్‌ తీసుకోవడంవల్ల జీర్ణవ్యవస్థ, రక్తనాళాలు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది.
  • ఒక వ్యక్తి రోజు మొత్తంలో ఎంత ప్రొటీన్‌ తీసుకోవాలి అనేది వారి శారీరక శ్రమ, బరువుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 1 కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్‌ కావాలట.
  • మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు సమతుల్యం కానప్పుడు జీవక్రియ దెబ్బతింటుంది. రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్‌ చేసే క్రమంలో మూత్రపిండాలకి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. కానీ ప్రొటీన్‌ ఎక్కువైతే అవి ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
  • ప్రొటీన్‌ ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. నురగతో కూడిన మూత్రం వస్తుంటే మన శరీరంలో ప్రొటీన్‌ ఎక్కువైంది అనడానికి సంకేతంగా చెబుతున్నారు నిపుణులు. దీన్ని ప్రొటీన్యూరియా అని కూడా అంటారు. ఈ లక్షణాలన్నీ మూత్రపిండాల అనారోగ్యానికి చిహ్నాలు.
  • అంతేకాదు... శరీరంలో ప్రొటీన్‌ శాతం ఎక్కువైతే అలసట, నిస్సత్తువ, నిద్రలేమి కాళ్ల తిమ్మిర్లు కూడా వస్తాయి. కొందరిలో నోటి దుర్వాసనకూ ఇదే కారణమట. కాబట్టి, బరువు తగ్గాలని దీన్ని అధికంగా తీసుకున్నారో... ఇన్ని సమస్యలన్నీ కొని తెచ్చుకుంటారన్న మాట. అందుకే అతి వద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్