చిన్నారులను నిద్ర పుచ్చాలంటే!

పెద్దల్లోనే కాదు... చిన్నారుల్లోనూ నిద్రలేమి వల్ల మానసిక ఇబ్బందులు, మూడ్‌ స్వింగ్స్‌, ఊబకాయం లాంటి రకరకల అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది.

Published : 29 Jun 2021 01:50 IST

పెద్దల్లోనే కాదు... చిన్నారుల్లోనూ నిద్రలేమి వల్ల మానసిక ఇబ్బందులు, మూడ్‌ స్వింగ్స్‌, ఊబకాయం లాంటి రకరకల అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. అలా కాకుండా ఉండాలంటే పిల్లలు రోజూ ఎనిమిది నుంచి పది గంటలు హాయిగా నిద్రపోయేలా చూడాలి. అందుకు కొన్ని రకాల పదార్థాలను వారి రోజూవారీ ఆహారంలో చేర్చాలి.

* ఓట్స్‌... వీటి నుంచి తగిన మొత్తంలో పీచు లభిస్తుంది. దాంతోపాటు నిద్రకు సహజంగా కారణమయ్యే మెలనిన్‌ ఉత్పత్తిని ఇవి ప్రేరేపిస్తాయి ఓట్స్‌లో మేలైన పిండి పదార్థాలు, విటమిన్‌-బి మెండుగా ఉంటాయి. ఇవి రోజులో కావాల్సిన శక్తిని అందిస్తాయి.

* నట్స్‌, గింజలు..  ట్రిఫ్టోఫాన్‌ అనే పదార్థం శరీరానికి కావాల్సిన విశ్రాంతిని అందిస్తుంది. ఇది ఎక్కువగా ఉండే గింజలు, నట్స్‌ను చిన్నారులకు అలవాటు చేయాలి.

* అరటి పండ్లు... వీటిలో సెరటోనిన్‌, మెలటోనిన్‌ అనే రసాయనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి నిద్ర పట్టడానికి దోహదపడతాయి. అంతేకాదు ఈ పండులో మెగ్నీషియం కూడా మెండుగానే ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన ప్రశాంతతను చేకూరుస్తుంది.

* చిలగడ దుంపలు.. ఆరోగ్యకరమైన ఈ దుంపల నుంచి పొటాషియం పెద్ద మొత్తంలో లభ్యమవుతుంది. ఇది శరీరానికి విశ్రాంతిని అందించి, నిద్రపట్టేలా చేస్తుంది.

* చీజ్‌... చిన్నారుల్లో చాలామందికి ఇష్టమైంది. ఇది కూడా నిద్ర పట్టడానికి బాగా తోడ్పడుతుంది.

* ఆహారంతోపాటు చిన్నారులు రోజూ కాసేపు నడక, వ్యాయామం లాంటివి చేసేలా చూస్తూ వారు హాయిగా కంటినిండా నిద్రపోతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్