పెంకితనానికి పరిష్కారం

పిల్లలు మనం చెప్పిందల్లా శ్రద్ధగా విని బుద్ధిగా నడచుకుంటే అంతకంటే సంతోషం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో పేచీలు పెడతారు. మొండితనాలు చూపుతారు. అలాంటప్పుడు రాజీమార్గంతోనే దార్లోకి

Published : 02 Jul 2021 01:08 IST

పిల్లలు మనం చెప్పిందల్లా శ్రద్ధగా విని బుద్ధిగా నడచుకుంటే అంతకంటే సంతోషం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో పేచీలు పెడతారు. మొండితనాలు చూపుతారు. అలాంటప్పుడు రాజీమార్గంతోనే దార్లోకి తెచ్చుకోవాలంటున్నారు సైకాలజిస్టులు...

* ‘ఆందోళనలూ అలజడులూ పెద్దవాళ్లకే కాదు.. పిల్లలకూ ఉంటాయి. హోంవర్క్‌ చేయాలనే అసహనం, ఇష్టమైన చాక్లెట్లు తినొద్దని వారించడం లాంటివి వాళ్లని మాట వికుండా పేచీ పెట్టేలా చేస్తాయి. కనుక ముందు మనం ప్రశాంతంగా ఉండి వాళ్ల ఇబ్బందేమిటో తెలుసుకోవాలి. ఊరట కలిగేలా మాట్లాడాలి. రాజీ మార్గమే పెంకితనానికి పరిష్కారం.

* ‘చిన్నప్పుడు మేమెంతో బుద్ధిగా ఉండేవాళ్లం’- అని చెప్పడం సరికాదు. ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజర్‌ పెరుగుతుంది. పూర్వం కంటే తెలివిగా ఉంటారు, ఐక్యూ లెవెల్‌ హెచ్చుగా ఉంటుంది. కనుక తరాల అంతరాలు అర్థం చేసుకోవాలి.

* ఎదురింటి, పక్కింటి పిల్లలతో పోల్చి నువ్వే మొండితనం చూపుతున్నావనడం వల్ల కోపం, కసి పెరుగుతాయి. పోల్చడం మానేసి మంచిగానే చెప్పేందుకు ప్రయత్నించాలి.

* ఎంత కోపం తెప్పించినా తిట్టి కొట్టినందువల్ల ప్రయోజనం లేదు. వాళ్లలా చేయడంవల్ల వచ్చే అనర్థాలను విడమర్చి చెప్పాలి.

* ఏదైనా కొనిస్తామని చెప్పి ఇవ్వలేకపోవడం, ఎక్కడికైనా తీసికెళ్తామని చెప్పి కుదరకపోవడం లాంటివి జరిగినప్పుడు ‘అయితే ఏంటి?’ అని గద్దిస్తే పిల్లలు నొచ్చుకుంటారు. ఆ బాధ కోపంగానో, మొండితనంగానో వెలిబుచ్చుతారు. బదులుగా ఎందుకు వీలవ్వలేదో కారణం చెప్పి, ఆలస్యంగానయినా చేస్తామని చెప్తే అర్థం చేసుకుంటారు.

* ఎప్పుడూ వేలెత్తి చూపడమే కాదు, మంచి లక్షణాలను మెచ్చుకుంటూ ఉండాలి. ఆ ప్రశంసల వల్ల కలిగే సంతోషం లోపాలను మార్చుకునేలా చేస్తుంది.

* పిల్లలతో వీలైనంత ఎక్కువసేపు గడుపుతూ ఆటపాటల్లో పాలుపంచుకుంటే వాళ్ల మనసుల్లోని అస్థిమితాలు అర్థమవుతాయి. అప్పుడిక మారాం చేసే సందర్భాలు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్